సరికొత్త రికార్డును సృష్టించిన పుష్ప శ్రీవల్లి సాంగ్... గ్లోబల్ టాప్ నెం.1గా ట్రెండ్!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం పుష్ప.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా,రష్మిక హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాకి తిరుగులేదని చెప్పాలి.ఇప్పటివరకు ఎన్నో సినిమాలు విడుదలైనప్పటికీ పుష్ప రికార్డును చెరపలేదు.

ఇక ఈ సినిమాలోని డైలాగులు పాటలు విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఈ క్రమంలోనే ఈ సినిమాలో పాటలు మిలియన్ వ్యూస్ సాధించి సోషల్ మీడియాను షేక్ చేశాయని చెప్పాలి.

ఇలా పుష్ప సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది.ఇక ఈ సినిమాలో సమంత నటించిన ఐటమ్ సాంగ్ ఉ అంటావా మామ ఊ.

ఊ అంటావా మామ అనే పాటకివచ్చిన క్రేజ్ మామూలుగా లేదు.ఇక ఈ పాటతో పాటు రష్మిక నటించిన శ్రీ వల్లి అనే సాంగ్ కూడా సరికొత్త రికార్డులను సృష్టించి ప్రేక్షకులను సందడి చేసింది.

ఇదిలా ఉండగా తాజాగా శ్రీవల్లి పాట మరొక రికార్డును కైవసం చేసుకుంది. """/" / తాజాగా హిందీ వర్షన్ శ్రీవల్లి పాట య్యూటూబ్ లో 400 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించుకున్న ఈ పాట గ్లోబల్ టాప్ నెం.

1 మ్యూజిక్ వీడియోగా ట్రెండింగ్ లో నిలిచింది.తెలుగు సినిమా నుంచి వచ్చిన పాటలో ఈ పాటకి ఇంత క్రేజ్ దక్కిందని చెప్పాలి.

ఇక ఈ పాటను లిరిసిస్ట్ చంద్రబోస్ అద్భుతమై లిరిక్స్ అందించగా దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన ట్యూన్ అందించారు.

మొత్తానికి శ్రీవల్లి పాట గ్లోబల్ టాప్ నెం.1 గా ట్రెండ్ అవడంతో ఇటు చిత్రబృందం అలాగే బన్నీ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.