కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్( Aishwarya Rajesh ) తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుంది.గ్లామర్ పాత్రలకన్నా అభినయం ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ తన సత్తా చాటుతూ వస్తున్న ఐశ్వర్య రాజేష్ కి తెలుగులో అంత గొప్ప అవకాశాలు రావట్లేదు.
కోలీవుడ్ ( Kollywood )లో కూడా అర కొర అవకాశాలతోనే కెరీర్ వెళ్లదీస్తుంది.అయితే ఐశ్వర్య రాజేష్ గ్లామర్ సీన్స్ లో నటించదు కాబట్టే ఆమెకు సినిమా అవకాశాలు రావట్లేదని అంటున్నారు.
అయితే ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఇక మీదట తాను కూడా గ్లామర్ రోల్స్ చేస్తానని అంటుంది.
పాత్ర ప్రాధాన్యతని బట్టి గ్లామర్ రోల్స్ కూడా చేసేందుకు తాను సిద్ధం అంటుంది.అయితే ఆ పాత్ర అలా ప్రవర్తించడానికి కథ డిమాండ్ చేయాలని అంటుంది.కేవలం కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గ్లామర్ పాత్రలా కాకుండా కథ డిమాండ్ చేస్తే తాను ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ అంటుంది.
సో ఐశ్వర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే ఆమెకు వరుస అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉన్నట్టే లెక్క.తెలుగులో కౌశల్యా కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్( Tuck Jagdish ) సినిమాల్లో నటించిన ఐశ్వర్య తెలుగు ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంది.