Hero-Director Hit Pairs: అచ్చోచ్చిన దర్శకులను నాలుగోసారి రిపీట్ చేస్తున్న హీరోలు

తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సెంటిమెంట్స్ ఎక్కువ.ఒక్కసారి హిట్ పడితే చాలు ఆ హీరో లేదా దర్శకుడు చివరికి హీరోయిన్ కూడా మళ్లి మళ్లి రిపీట్ అవుతారు.

 Tollywood Heros And Directors Hit Combination Repeat Allu Arjun Raviteja Balakr-TeluguStop.com

ఇక తమకు హిట్ ఇచ్చిన దర్శకులను సైతం టాలీవుడ్ హీరోలు ఈ మధ్య బాగానే రిపీట్ చేస్తున్నారు.ఈ లిస్ట్ లో అల్లు అర్జున్, రవి తేజ, బాలకృష్ణ వంటి టాలీవుడ్ బడా స్టార్స్ ఉండటం విశేషం.మరి ఏ టాలీవుడ్ హీరోకి ఏ దర్శకుడు ఎన్ని సార్లు హిట్ ఇచ్చారు మళ్లి ఏం సినిమా చేయబోతున్నారు అనే విషయం ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అల్లు అర్జున్

Telugu Allu Arjun, Alluarjun, Balakrishna, Boyapati Srinu, Pairs, Ravi Teja-Movi

అల్లు అర్జున్( Allu Arjun ) ప్రస్తుతం పుష్ప సీక్వెల్ తీస్తున్న విషయం తెలిసిందే.అయితే తనకు బాగా అచ్చోచ్చిన దర్శకుడు అయినా త్రివిక్రమ్ కి( Trivikram ) తన తదుపరి సినిమా అప్పగించాడు.ఇదివరకు బన్నీ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో జులాయి, ఆలా వైకుంఠపురంలో, s/o సత్యమూర్తి సినిమాలు వచ్చి విజయం సాధించడం తో నాలుగో సారి కూడా అల్లు అర్జున్ త్రివిక్రమ్ కి అవకాశం ఇచ్చాడు.

రవి తేజ

Telugu Allu Arjun, Alluarjun, Balakrishna, Boyapati Srinu, Pairs, Ravi Teja-Movi

ప్రస్తుతం రవి తేజ( Raviteja ) ప్లాప్ లలో ఉన్నాడు.ఎప్పుడు రవి తేజ ఫెయిల్యూర్స్ లో ఉన్న కూడా గోపి చంద్ మలినేని హిట్ ఇస్తూ వస్తున్నాడు.ఇది వరకు వీరి కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి సినిమాలు వచ్చి విజయం సాధించాయి.ఇప్పుడు నాలుగోసారి మళ్లి వీరిద్దరూ జత కట్టారు.

బాలయ్య

Telugu Allu Arjun, Alluarjun, Balakrishna, Boyapati Srinu, Pairs, Ravi Teja-Movi

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) కెరీర్ చివరి కొన్నేళ్లు గమనిస్తే బోయపాటి తో సినిమాలు తీస్తూ వస్తున్నాడు.ఇప్పటి వరకు బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్, సింహ, అఖండ సినిమాలు ఇండస్ట్రీ హిట్ అయినా సంగతి తెలిసిందే.ప్రస్తుతం అనిల్ రావిపూడి తో సినిమా తీస్తున్న బాలయ్య నాలుగోసారి బోయపాటి తో సినిమా తీయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube