టీమ్ ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.క్రికెటర్ గా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టినటువంటి ధోని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఈ విధంగా క్రికెట్ రంగంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన అనంతరం సినిమాలపై ఉన్న ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఈ క్రమంలోనే ధోని ఎంటర్టైన్‌మెంట్ (Dhoni Entertainment) పేరిట నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు.
తొలి సినిమాగా ‘లెట్స్ గెట్ మ్యారీడ్ ‘(LGM) ని రూపొందించారు.
ఈ క్రమంలోనే సోమవారం చెన్నైలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.ధోని నిర్మాణంలో రాబోతున్నటువంటి ఈ సినిమాలో కోలీవుడ్ కమెడియన్ యోగిబాబు (Yogi Babu) ఓ పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇక యోగి బాబు ధోనీకి పెద్ద అభిమాని అన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో యోగిబాబుకి ధోని మధ్య జరిగిన సంభాషణ నెటీజన్లను ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా యోగి బాబు మాట్లాడుతూ.ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి తనను తీసుకోవాలని ధోని ని కోరారు. ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి తనని తీసుకోవాలని కోరడంతో ఒక్కసారిగా ధోని షాక్ అవ్వడమే కాకుండా తన స్టైల్ లో సమాధానం చెప్పారు.ఈ ప్రశ్నకు ధోని సమాధానం చెబుతూ చెన్నై జట్టులో కీలక ఆటగాడు అయిన అంబటి రాయుడు (Ambati Rayudu) ఇటీవలే రిటైర్ అయ్యాడు.

కాబట్టి ఆ స్థానం ఖాళీగానే ఉంది.వచ్చి జాయిన్ అయిపో అంటూ సమాధానం చెప్పారు.అయితే ఇందులో నిలకడగా ఆడాలని తెలిపారు.మీరు సినిమాలతో ఎంతో బిజీగా ఉంటారు.అయితే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు మీరు గాయపడాలనే బౌలింగ్ చేస్తూ ఉంటారంటూ ధోని సమాధానం చెప్పడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.







