సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు తెలంగాణ ఇంపాక్ట్ గట్టిగా ఉండనే చెప్పాలి.గత కొన్నేళ్లుగా సినిమాల్లో తెలంగాణ పేర్లు, భాషలు వినిపిస్తూనే ఉన్నాయి.
తాజాగా ఎన్నో హిట్ సినిమాల్లో తెలంగాణ యాస మాట్లాడుతున్నారు.ఒకప్పుడు తెలంగాణ అనే పదమే వినిపించేది కాదు.
అయితే ఇప్పుడు తెలంగాణ క్రేజీ హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చి పెడుతోంది.ఆ సినిమాలు, ఆ హీర్లోలు ఎవరో ఇప్పుడు చూసేద్దాం.
విజయ్ దేవరకొండ కెరీర్ లో మొదటి హిట్ ఇచ్చిన సినిమా పెళ్లి చూపులు.( Pelli Choopulu ) ఈ సినిమాని తరుణ్ భాస్కర్ రూపొందించారు.ఈ సినిమా తెలంగాణ యాసలో సాగుతుంది.ఈ సినిమాతో విజయ్ కి హిట్ కొట్టడమే కాకుండా హీరోగా ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు.
ఇదే సినిమాలో విజయ్ తో పటు ప్రియదర్శి కూడా అద్భుతమైన నటనతో అదరగొట్టాడు.ఈ సినిమాతో జాతీయ స్థాయిలో ఉత్తమ డైలాగ్ రైటర్‌గా తరుణ్ భాస్కర్ కు అవార్డు వచ్చింది.
ఈ సినిమా తరువాత 2017 లో విజయ్ అర్జున్ రెడ్డి సినిమాతో( Arjun Reddy ) సంచలనాన్ని సృష్టించాడు.విజయ్ ని ఈ సినిమా స్టార్ ని చేసింది.
అయితే ఈ సినిమాలో శివ క్యారెక్టర్ చేసిన రాహుల్ కూడా గుర్తుండిపోయే రోల్ చేసారు.ఈ సినిమా కూడా తెలంగాణ యాసతో సాగినదే.

సాయి పల్లవి కెరీర్ లో ఫిదా సినిమా( Fidaa Movie ) అద్భుతమైన విజయాన్ని సాధించింది.సాయి పల్లవి పల్లెపడుచుగా తన మార్క్ నటనతో, డాన్స్ తో కట్టుకుంది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాని శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు.ఈ సినిమా 100 కోట్ల వసూళ్లు రాబట్టింది.లాక్ డౌన్ తరువాత విడుదలైన జాతిరత్నాలు సినిమా( Jathi Ratnalu ) ఒక సంచలనం అనే చెప్పాలి.
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ఈ సినిమా కూడా తెలంగాణ యాసలో ఉంటుంది.ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.

4 కోట్లతో నిర్మించిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద రూ.65 నుంచి రూ.75 కోట్ల వసూళ్లు సాధించింది.తాజాగా నాని కెరీర్ లో భారీ హిట్ కొట్టిన దసరా సినిమా( Dasara Movie ) తెలంగాణ యాసలోనే ఉంటుంది.
విశ్వక్ సేన్ కెరీర్ లో భారీ హిట్ సినిమాలు కూడా తెలంగాణ యాసలోనే ఉన్నాయి.ఫలక్ నుమా దాస్, అశోక వనంలో అర్జున కల్యాణం విశ్వక్ కి మంచి పేరుని తెచ్చిపెట్టాయి.
తాజాగా చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని సాధించిన సినిమా బలగం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.ఈ సినిమాపై అందరు ప్రశంసల వర్షం కురిపించారు.ఇలా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో తెలంగాణ హావ నడుస్తుందనే చెప్పాలి.







