దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి(SS Rajamouli) ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు.ఈయన తనకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే రాజమౌళి తన కుటుంబంతో కలిసి తమిళనాడులోని పలు దైవ దర్శనాలకు వెళ్లినట్లు ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాజమౌళికి ఎప్పటినుంచో రోడ్డు ట్రిప్ చేస్తూ తమిళనాడులోని (Tamilanadu)పలు ఆలయాలను(Temples) సందర్శించాలని కోరికగా ఉండేదట.
ఈ క్రమంలోనే తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాను అంటూ ఈ సందర్భంగా ఈయన ఈ విషయాన్ని వెల్లడించారు.ఇలా కుటుంబ సమేతంగా పలు దైవ దర్శనాలను సందర్శించుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.ఇలా దైవదర్శనం చేసుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను ఇప్పటికీ నెరవేరింది.
ఈ విషయంలో మా అమ్మాయికి ధన్యవాదాలు చెప్పాలి జూన్ చివరి వారం అంతా శ్రీరంగం బృహదీశ్వరాలయం, రామేశ్వరం, కనుడుకథన్, మధురై వంటి పలు దైవ దర్శనాలకు వెళ్ళామని తెలియజేశారు.
ఈ దేవాలయాలలో శిల్పకళ చూసి తనకు చాలా ఆశ్చర్యం కలిగిందని తెలిపారు.చోళుల కాలంలో ఎంతో ప్రతిభ కలిగినటువంటి ఇంజనీర్ లో ఉన్నారు.వారి ఆలోచన ప్రతిభ అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశాయి.
అంటూ ఈ ఆధ్యాత్మిక దర్శనాల గురించి రాజమౌళి చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ వీడియో పై స్పందిస్తూ నిజం చెప్పండి జక్కన్న మీ డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం(Mahabaratham) కోసమే ఈ ప్రయాణం చేశారు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.