బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్( Salman Khan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ కూడా ఒకరు.56 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే బ్యాచిలర్ గానే లైఫ్ ని లీడ్ చేస్తున్నారు.ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నారు.
పెళ్లి అనే మాట లేకపోయినా కూడా ఆయన లైఫ్ లో లవ్ స్టోరీలు చెప్పలేనన్ని ఉన్నాయని చెప్పవచ్చు.ఎంతోమంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపారు సల్మాన్ ఖాన్.
ఇంకా చెప్పాలంటే చాలా మంది హీరోయిన్లతో సహజీవనం కూడా చేశారు.

కానీ పెళ్లి విషయంలో మాత్రంసరైన నిర్ణయం తీసుకోలేకపోయారు సల్మాన్ ఖాన్.మరి ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ ఏయే హీరోయిన్లతో ప్రేమాయణం నడిపారు.ఎవరితో సహజీవనం చేశారు అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోయిన్ పూజ హెగ్డే ( Pooja Hegde )తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.గత నెల రెండు నెలలుగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
రెండు మూడు సార్లు పూజా, సల్లు భాయ్ కలిసి కనిపించడంతో చాలామంది ఆ వార్తలు నిజమే అని నమ్ముతున్నారు.

ఇక సల్మాన్ ఖాన్ ప్రేమ విషయంలో ఎక్కువగా వినిపించే పేరు కత్రినా కైఫ్( Katrina Kaif ).ఈమె సల్మాన్ ఖాన్ తో ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగేళ్ల పాటు సహజీవనం చేసింది.ఆ తర్వాత అతనికి బ్రేకప్ చివరికి విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.
సల్మాన్ ఖాన్ మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ ( Aishwarya Rai )తో కూడా ప్రేమాయణం కొనసాగించారు.ఆ తర్వాత ఈమె అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుని సెటిలైపోయింది.
అలాగే సల్మాన్ ఖాన్ సోనాక్షి సిన్హాతో కూడా ప్రేమాయణం నడిపారు.వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ కాస్త సీరియస్ గా కొనసాగినప్పటికీ చివరికి విడిపోయారు.
అలాగే సల్మాన్ ఖాన్ షహీన్( Shaheen ) తో కలిసి కొంతకాలం పాటు ప్రేమయాణం కొనసాగించారు.ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఈ జంట విడిపోయి షాక్ ఇచ్చారు

మన హీరోయిన్లను మాత్రమే కాకుండా చివరికి పాకిస్తానీ హీరోయిన్ ని కూడా విడిచి పెట్టలేదు సల్మాన్ ఖాన్.పాకిస్తాన్ నటి సోమి( Pakistani actress Somi )తో కూడా సల్మాన్ ఖాన్ ప్రేమ వ్యవహారాన్ని నడిపించారు.అలాగే హీరోయిన్ సంగీత బజ్లాతో గతంలో ప్రేమ వ్యవహారం నడిపించడంతోపాటు పెళ్లి చేసుకునే వరకు కూడా వెళ్లారు.
కానీ ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు.అలాగే టాలీవుడ్ సినిమాలో నటించి మెప్పించిన హీరోయిన్ స్నేహ ఉల్లాల్ తో కూడా ప్రేమాయణం నడిపించారు సల్మాన్.
కేవలం వీరు మాత్రమే కాకుండా ఇంకా చెప్పుకుంటే చాలా పెద్దలిస్టే ఉందని చెప్పవచ్చు.