మరింత భారం కానున్న రీఛార్జిలు.. నిన్న జియో, నేడు ఎయిర్టెల్.. ఇకబాదుడే..

గత కొంతకాలం నుండి మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్( Mobile Recharge Plans ) కు సంబంధించిన ధరలను పెంచాలని వివిధ నెట్వర్క్ కంపెనీలు ప్లాన్ చేస్తూ వచ్చాయి.

అయితే 2024 ఎన్నికల నేపథ్యంలో భాగంగా జూన్ నెల వరకు ఆ ధరలను పెంచకుండా అలాగే పొడిగించాయి.

ఇక ప్రస్తుతం టెలికాం సంస్థలు వరుసగా వారి రీచార్జి ధరలను పెంచేశాయి.గురువారం నాడు జియో తన రీఛార్జ్ ప్లాన్ల రేట్లు అమాంతం పెంచగా తాజాగా అదే దారిలో ఎయిర్టెల్ కూడా అదే పని చేసింది.

నేడు మొబైల్ సర్వీస్ ధరలను పెంచుతున్నట్లు ఎయిర్టెల్( Airtel ) ప్రకటించింది.ఇందులో భాగంగా జులై 3 తేదీ నుండి నుంచి 10 నుంచి 21 శాతం వరకు ధరలు పెరుగుతున్నట్లు తెలిపింది.అలాగే మరోవైపు జియో కూడా మొబైల్ టారీఫ్స్ లో 12 నుంచి 27% వరకు పెంపుదలను ప్రకటించింది.

అయితే గత రెండున్నర ఏళ్ల నుండి టెలికాం సంస్థలు వినియోగదారులపై ఎలాంటి భారాన్ని ఎక్కువగా మోపకుండా వచ్చాయి.కాకపోతే., ప్రస్తుతం పెంచిన ధరలతో వినియోగదారులకు రీఛార్జి డబ్బులు మరింత వారం కానున్నాయి.

Advertisement

ఈ నేపథ్యంలో రెండు కంపెనీలు ఏ ప్లాన్ పై ఎంత అమౌంటును పెంచిందన్న విషయం సంబంధించిన వివరాలను సోషల్ మీడియా( Social media ) ద్వారా ప్రకటించాయి.భారతదేశంలోని టెల్కోలకు ఆర్థికంగా ఆరోగ్యకరమైన వ్యాపారలను మొదలు పెట్టేందుకు ప్రతి వినియోగదారుడు పై యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్ (ARPU ) 300 రూపాయల కంటే ఎక్కువగా ఉండాలని భారతి ఎయిర్టెల్ మీడియా ప్రకటనలో తెలియజేసింది.2019లో టెలికాం సంస్థలు 20 నుంచి 40% రేట్లు పెంచిన 2021లో మళ్లీ 20% ధరలను పెంచాయి.దీంతో ప్రజలపై మరింత భారం పడనుంది.

ఒడిశా: వలకు చిక్కిన 40 కిలోల అరుదైన భారీ చేప.. దాని విశేషాలు ఏంటంటే..??
Advertisement

తాజా వార్తలు