యూకే: భీకర తుఫానుకు ఎదురెళ్లి.. విమానాన్ని దించిన వైనం, ఎయిరిండియా పైలట్లపై ప్రశంసలు

యూనిస్ తుఫాను ధాటికి ఐరోపా ఖండం చివురుటాకులా వణుకుతోంది.ముఖ్యంగా బ్రిటన్‌పై దీని ప్రభావం తీవ్రంగా వుంది.

భీకరమైన ఈదురు గాలులు ధాటికి చెట్లు, స్తంభాలు నేలకూలడంతో పాటు ఏకంగా మనుషులు కూడా గాల్లోకి ఎగిరిపోతున్నారు.మరోవైపు లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో పైలట్‌లు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

గంటకు 190 కిలోమీటర్లకు పైగా వేగంతో వీస్తోన్న గాలుల ధాటికి విమానాలను ల్యాండింగ్‌‌లు చేయడం క్లిష్టంగా మారింది.భీకర పవనాల ధాటికి విమానాలు గాల్లో ఊగుతున్నాయి.

ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఇద్దరు ఎయిరిండియా పైలట్లు విమానాలను అత్యంత చాకచక్యంగా ల్యాండింగ్ చేసి ఔరా అనిపించుకున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో మన పైలట్లపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Advertisement

బిగ్‌జెట్ టీవీ అనే యూట్యూబ్ ఛానెల్ 2 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లతో ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండింగ్, టేకాఫ్‌లను లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు.శుక్రవారం హీత్రో రన్‌వే 27Lపై ఎయిరిండియా విమానం ల్యాండైన దృశ్యాలను ఇది స్ట్రీమ్ చేసింది.

హైదరాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం AI-147లో కెప్టెన్ అంచిత్ భరద్వాజ్. గోవా నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం AI-145లో కెప్టెన్ ఆదిత్యరావు విధులు నిర్వర్తిస్తున్నారు.

రెండు విమానాల్లోనూ కాక్‌పిట్ సిబ్బందిలో ఫస్ట్ ఆఫీసర్లు కెప్టెన్ రాహుల్ గుప్తా, కెప్టెన్ సుశాంత్ తారే, కమాండర్ కెప్టెన్ మన్మత్ రౌత్రే, ట్రైనీ కమాండర్ కెప్టెన్ వి రూప వున్నారు.భీకర తుఫాను విరుచుకుపడిన సమయంలో ఇతర ఏవియేషన్ సంస్థలకు చెందిన పైలట్లు ల్యాండింగ్ చేయడానికి భయపడిన సమయంలో మన పైలట్లు అత్యంత చాకచక్యంగా విమానాలను హీత్రూలో దించారని ఎయిరిండియా ప్రశంసించింది.ఇదే సమయంలో చాలా విమానాలు రద్దవ్వడమో, దారి మళ్లించడమో లేదంటే గాల్లోనే చక్కర్లు కొట్టడమో జరిగింది.

యూకే వాతావరణ శాఖ ప్రకారం.ఇంగ్లాండ్ దక్షిణ తీరంలో వున్న ఐల్ ఆఫ్ వైట్‌లో గంటకు 196 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

గడిచిన మూడు దశాబ్ధాల్లో అత్యంత భయంకరమైన తుఫానుగా దీనిని అభివర్ణించారు శాస్త్రవేత్తలు.

Advertisement

తాజా వార్తలు