కరోనా మహమ్మారి దేశంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న విషయం విదితమే.ముఖ్యంగా కర్ణాటక లో ఈ మహమ్మారి స్వైర విహారం చేస్తుంది.
కర్ణాటక లోని ఒక్క బెంగుళూరు నగరంలోనే అత్యధికంగా కేసులు నమోదు అవుతుండడం మరింత ఆందోళన కలిగిస్తుంది.అయితే అక్కడ కరోనా రోగులకు సేవలు అందించేందుకు త్వరలో ఎయిర్ అంబులెన్స్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది.
ఈ నెల నుంచే ఈ ఎయిర్ అంబులెన్స్ సేవలను ప్రజలకు అందించనున్నట్లు సమాచారం.దీనితో ఈ సేవలను అందించే తొలి విమానాశ్రయంగా బెంగళూరులోని జక్కూర్ విమానాశ్రయం నిలవబోతోంది.
హెలికాప్టర్, విమానం అంబులెన్స్ సేవలు ఈ నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి.మారుమూల గ్రామాల నుంచి సైతం రోగులను తీసుకొచ్చేందుకు ఈ సేవలను వినియోగించుకోవచ్చు.
రోగులకు ఈ ఎయిర్ అంబులెన్స్ లో అత్యవసరంగా సేవలు అందించడం కోసం ఒక వైద్యుడు,పారా మెడికల్ అధికారి, నర్సు,ఇద్దరు పైలట్లు అందుబాటులో ఉండనున్నారు.ఈ సేవలను ఐకాట్ క్యాథి ఎయిర్ అంబులెన్స్ నిర్వహిస్తోంది.
ప్రస్తుతం ఈ సంస్థ ముంబై,ఢిల్లీ వంటి నగరాల్లో కూడా సేవలను అందిస్తుండగా,బెంగుళూరు లో కూడా ఈ ఎయిర్ అంబులెన్స్ సేవలను ప్రారంభించేందుకు సీఎం యడ్యూరప్ప అంగీకరించినట్లు ఆ సంస్థ మార్కెటింగ్ హెడ్ తెలిపారు.