గుజరాత్ లో ఘోర ప్రమాదం,జాయ్ రైడ్ కూలిపోయింది

గుజరాత్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.అహ్మదాబాద్ లోని అడ్వెంచర్ పార్క్ లో జాయ్ రైడ్ కూలిపోవడం తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడినట్లు తెలుస్తుంది.ఆదివారం సెలవు రోజు కావడం తో అడ్వెంచర్ పార్క్ కు చాలా మంది వచ్చారు.

ఈ క్రమంలో పార్క్ లో ఎంజాయ్ చేయడానికి వచ్చిన వారంతా ఇలా ప్రమాదానికి గురికావడం తో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.జాయ్ రైడ్ లో ఎంజాయ్ చేస్తున్న సమయంలో అది ఒక్కసారిగా కుప్పకూలిపోవడం తో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా,మరో 29 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది.దీనితో ఈ ఘటన లో గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన మణి నగర్ లోని ఎల్ జీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisement

అయితే ఈ ఘటన ఎలా జరిగింది, ఈ ఘటనకు గల కారణం ఏంటి అన్న దానిపై దర్యప్తు చేపట్టినట్లు అహ్మదాబాద్ మునిసిపల్ కమీషనర్ తెలిపారు.ప్రధాన షాఫ్ట్ పైపు విరిగి నేలమీద కుప్పకూలిందని, దీనిపై ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ దర్యాప్తు చేస్తోందని చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌ దస్తూర్ వెల్లడించారు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పిల్లలు ఇలా తయారవుతున్నారేంటి.. ఫోన్ లాక్కోగానే టీచర్‌ను చంపేస్తానన్న విద్యార్థి.. వీడియో చూస్తే..!
Advertisement

తాజా వార్తలు