'ఆహా' సర్కార్‌ గేమ్‌ షో.. ప్రదీప్ ఆహా అనిపించాడబ్బా

తెలుగు ప్రేక్షకులకు అపరిమిత వినోధంను అందించేందుకు గాను మొదలు అయిన ఆహా ఓటీటీ వారం వారం సరికొత్త కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుంది.

మొదట్లో చిన్న చిన్న టాక్ షో లు మరియు చిన్న సినిమా లు డబ్బింగ్ సినిమా లు ఇంకా బూతు వెబ్‌ సిరీస్ లను స్ట్రీమింగ్ చేసిన ఆహా వారు ఇప్పుడు భారీ ఎత్తున టాక్ షో లు మరియు పెద్ద ఎత్తున గేమ్‌ షో లను ప్లాన్ చేస్తున్నారు.

అంతే కాకుండా ప్రముఖ హీరోల సినిమా లు మరియు పెద్ద పెద్ద వెబ్‌ సిరీస్ లను కూడా స్ట్రీమింగ్‌ చేసేందుకు గాను సిద్దం అవుతున్నారు.తాజాగా ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న గేమ్‌ షో సర్కారు.

ఇప్పటి వరకు ఓటీటీ ల్లో గేమ్‌ షో లను తెలుగు ప్రేక్షకులు చూడలేదు.మొదటి సారి ఆహా వారు ప్రత్యేకంగా ఈ గేమ్‌ షో ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

ప్రదీప్ మాచి రాజు ఈ గేమ్ షో యొక్క హోస్ట్‌ అవ్వడం వల్ల అంచనాలు పెరిగి పోయాయి.అంచనాలకు తగ్గట్లుగా షో ఉంది.

Advertisement

ఈ షో కు ప్రముఖ డైరెక్టర్స్ నితిన్ మరియు భరత్‌ లు డైరెక్టర్స్ గా వ్యవహరించారు.వీరు జబర్దస్త్‌ తో పాటు ఇంకా పలు షో లను రూపొందించిన విషయం తెల్సిందే.ఇప్పుడు వారి నుండి వచ్చిన సర్కార్‌ కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

ప్రదీప్ సమయస్ఫూర్తిగా వేస్తున్న పంచ్‌ లు మరియు అడిగే ప్రశ్నలు.అందుకు తగ్గట్లుగా ఉన్న ఆట అన్ని కూడా చాలా బాగున్నాయి అంటూ చూసిన వారు అంటున్నారు.

సర్కార్‌ గేమ్‌ షో మొదటి ఎపిసోడ్‌ లో హీరో విశ్వక్‌సేన్‌.దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌..

నటుడు అభి మరియు హీరోయిన్ అనన్య.ఈ నలుగురితో ప్రదీప్ ఆడిన ఆట సందడి మామూలుగా లేదు.వేలం పాటలో డబ్బులు పెట్టి ప్రశ్నలు కొనుగోలు చేయాలి.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే పాడిన పాటకు డబుల్‌ అమౌంట్ వస్తుంది.మొత్తం పది ప్రశ్నలు ఉంటాయి.

Advertisement

ఒక్కో ప్రశ్నకు హింట్స్ ఇస్తూ ఉంటాడు.దాంతో వేలం పాట పెరుగుతూ ఉంటుంది.

అలా గేమ్ ఆసక్తికరంగా మారుతూ సాగింది.మొత్తానికి ఆహా అనిపించే విధంగా సర్కార్‌ గేమ్‌ షో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు