అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ గుండెపోటుతో మృతి

Agrigold Vice Chairman Died

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన అగ్రిగోల్ద్ స్కేం గురించి అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఈ కేసుని సిబిఐ విచారణ చేస్తుంది.

 Agrigold Vice Chairman Died-TeluguStop.com

ఇక చాలా కాలంగా అగ్రిగోల్ద్ బాధితులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు.తాము పోగొట్టుకున్న సొమ్ములు వెనక్కి ఇప్పించాలని ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు.

ఇప్పటికే అగ్రిగోల్ద్ సంస్థలో పేద, మధ్యతరగతి ప్రజలని దోచుకున్న ఆ సంస్థ అధిపతులని పోలీసులు అరెస్ట్ చేసారు.అయితే అందులో కొంత మంది కి ఆ మధ్య బెయిల్ కూడా ఇచ్చారు.

ఇదిలా ఉంటే తాజాగా అగ్రిగోల్ద్ సంస్థ వైస్ చైర్మన్, అగ్రిగోల్ద్ స్కేంలో ప్రధాన ముద్దాయిలో ఒకరైన ఇమ్మడి సదాశివ వరప్రసాద్ ఈ రోజు ఊహించని విధంగా గుండెపోటుతో మరణించారు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోగా వెంటనే సమీపంలో హాస్పిటల్ కి తరలించారు.

అయితే అప్పటికే అతని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.గత కొంత కాలంగా సదాశివరావు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది.

ఈ ఘటనపై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube