ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసి రిఫండ్ కు ప్రయత్నించగా రూ.5 లక్షలు స్వాహా..!

ప్రస్తుతం అన్ని పనులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది అన్ లైన్.

ఎందుకంటే పనులు తొందరగా పూర్తవాలన్న, తెలియని విషయాలు పూర్తిగా తెలియాలన్న ఆన్ లైన్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

అయితే సైబర్ నేరగాళ్లు ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు కొత్త కొత్త ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు.తాజాగా ఓ వ్యక్తి విమాన టికెట్లు( Flight tickets ) క్యాన్సల్ చేసి రిఫండ్ కోసం ప్రయత్నించే క్రమంలో సైబర్ వల్ల చిక్కాడు.ఏకంగా రూ.5 లక్షలు పోగొట్టుకున్నాడు.చివరకు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వివరాల్లోకెళితే.మహారాష్ట్ర లోని థానే( Thane ) కు చెందిన బాధిత వ్యక్తి తన ఫ్రెండ్ తో కలిసి కెన్యాలోని మొంబాసా సిటీకి( Mombasa City, Kenya ) టూర్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాడు.అందుకోసం రూ.1.46 లక్షలు చెల్లించి ఈనెల 29న వెళ్లడానికి, మే 5న రిటర్న్ వచ్చేలా రాను పోను విమాన టికెట్లు బుక్ చేసుకున్నాడు.కానీ పనుల వల్ల టూర్ షెడ్యూల్ మారడంతో విమాన టికెట్లు క్యాన్సల్ చేసుకున్నాడు.

రిఫండ్ పొందడం కోసం గూగుల్ లో సర్చ్ చేసి ఓ ఎయిర్ లైన్ వెబ్సైట్ లో రిఫండ్ ఫామ్ కూడా ఫిల్ చేసేశాడు.గూగుల్లో పక్కనే ఉన్న ఎయిర్ లైన్ ఫేక్ హెల్ప్ లైన్ ( Airline Fake Helpline )కాంటాక్ట్ నెంబర్ కు కాల్ చేశాడు.

Advertisement

అవతలి వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి తాను ఎయిర్ లైన్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు.బాధితుడు రిఫండ్ విషయం గురించి చెబితే, ఆ బాధితుడు తనను నమ్మేలా మాట్లాడి ఓ యాప్ డౌన్లోడ్ చేయించి క్షణాల్లో బాధితుడి ఖాతా నుండి 4.8 లక్షలు కాజేశాడు.తన ఖాతాలో డబ్బు మాయమైందని తెలుసుకున్న బాధితుడు చివరకు పోలీసులను ఆశ్రయించాడు.

11 నిమిషాలు చచ్చిపోయి బతికిన మహిళ.. స్వర్గం, దేవుడు, నరకం చూసిందట...
Advertisement

తాజా వార్తలు