సంస్కృతంలో మంత్రాలు చదువుతున్న ఆఫ్రికన్ పూజారి.. వీడియో చూస్తే..

భారతీయ సంస్కృతులు ఆచారాలను పాటించే వ్యక్తులు విదేశాల్లో కూడా ఉంటారు.హిందూ దైవుళ్లను పూజించేవారు కూడా ఉంటారు.

 African Priest Recites Sanskrit Shlokas Performing Car Puja Video Viral Details,-TeluguStop.com

అయితే సంస్కృతంలో మంత్రాలు( Sanskrit Shlokas ) చదివే వారు చాలా అరుదు అని చెప్పవచ్చు.మనదేశంలోని పూజారుల వలె ఇతర దేశాల్లోని పూజారులు అనర్గళంగా సంస్కృతంలో మంత్రాలు చదవడం దాదాపు అసాధ్యమని చెప్పుకోవచ్చు.

ఎందుకంటే ఆ ఉచ్చరణ చాలా కష్టంగా ఉంటుంది.అయితే ఆ అసాధ్యాన్ని తాజాగా ఒక ఆఫ్రికన్ పూజారి( African Priest ) సుసాధ్యం చేసి చూపించారు.

ఈ పూజారి సంస్కృతంలో శ్లోకాలు అద్భుతంగా చదువుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సాధారణంగా హిందూ సంస్కృతిలో వాహనాలు లేదా గృహాలను కొనుగోలు చేసేటప్పుడు శుభ ప్రారంభాల కోసం దైవిక ఆశీర్వాదం కోసం అయ్యగారితో పూజ చేయిస్తారు.

వైరల్ వీడియోలో కూడా కొత్త వాహనం కొనుగోలు చేసిన సందర్భంగా ఆఫ్రికన్ పూజారి ఆకట్టుకునే ఉచ్చారణతో పవిత్ర శ్లోకాలైన సంస్కృత శ్లోకాలను పఠించడం కనిపిస్తుంది.ఆచారం ప్రకారం కారు ముందు దాని హుడ్ తెరిచి మంత్రాలు చదివారు, సద్భావన, రక్షణ కోసం దేవతలకు ప్రార్థనలు చేశారు.

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ అయి ఇండియాలో బాగా వైరల్ అవుతుంది.చాలామంది నెటిజన్లు పూజారి( Priest ) ఉచ్చారణను ప్రశంసించారు, ఆయన సంస్కృతం( Sanskrit ) చాలా మంది భారతీయుల కంటే మెరుగ్గా ఉందని పేర్కొన్నారు.ఈ ఆఫ్రికన్ పూజారి హిందూ మంత్రాలు చదవడం కాక చేతులతో “ముద్రలు” అని పిలిచే నిర్దిష్ట చేతి సంజ్ఞలు చేయడం కూడా కనిపించింది.

ఇటువంటి ఆచారాలు నిర్వహించడం ఆఫ్రికా, భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు.భారతదేశంలోని దక్షిణ కొరియా రాయబార కార్యాలయం( South Korean Embassy ) కూడా కొత్త హ్యుందాయ్ జెనెసిస్ GV80 కోసం ఇదే విధమైన వేడుకలో పాల్గొంది, పూజారి అంబాసిడర్ మణికట్టు చుట్టూ పవిత్రమైన దారాన్ని కట్టడం, అంబాసిడర్ కారు హుడ్‌పై పుష్పాలను ఉంచడం వంటి పూజా క్లిప్‌ను ఎంబసీ షేర్ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube