NZB: కోర్టు ప్రాంగణంలో న్యాయవాదుల ధర్నా యువ న్యాయవాదులు విశ్వక్ సేన్ రాజ్, భానుచందర్ ఆచార్యపై దాడికి పాల్పడిన ట్రాఫిక్ SI చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం నిజామాబాద్ కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
చంద్రశేఖర్ ను ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని కోరారు.
కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం గణపతి, కార్యదర్శి నరేందర్ రెడ్డి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.