తన అందం అభినయంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి నటి కనిహా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తెలుగులో హీరో శ్రీకాంత్ నటించిన ఒట్టేసి చెబుతున్న సినిమాలో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
ఇలా తన అందంతో ఎంతో మందిని ఆకట్టుకున్నటువంటి ఈమె అనంతరం రవితేజ హీరోగా నటించిన నా ఆటోగ్రాఫ్ సినిమాలో నటించారు.ఈ విధంగా పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె అనంతరం అవకాశాలు క్రమక్రమంగా తగ్గిపోవడంతో తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు.
ఇలా తెలుగు తెరకు దూరమైనటువంటి కనిహా మలయాళ ఇండస్ట్రీలో స్థిరపడి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండిపోయారు.తెలుగు చిత్ర పరిశ్రమకు ఈమె దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా మాత్రం నిత్యం అభిమానులకు దగ్గరవుతూనే ఉంటారు.ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తూ ఉంటారు.అయితే తాజాగా ఈమె పెద్ద ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే తన మోకాలి నుంచి కుడికాలు కింది మొత్తం వరకు బాగా డామేజ్ అయినట్టు తెలుస్తుంది.
ఇలా కాలు మొత్తం గాయం కావడంతో ఇంట్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నటువంటి ఈమె ఇప్పుడే కోలుకొని కాస్త వాకర్ సహాయంతో అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ బ్యాలెన్స్ గా అడుగులు వేయడం నేర్చుకుంటున్నాను అంటూ తన కాలికి గాయ మైనటువంటి ఫోటోని షేర్ చేశారు.ఇలా ఈ ఫోటో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు అసలు ఏమైంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మరి కొందరు మాత్రం తొందరగా క్షేమంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.