ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి ఆకస్మిక తనిఖీ

ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా డిఎంవో, డిఎస్వో, వైద్యాధికారులు విధుల్లో ఉన్నది లేనిదీ పరిశీలించారు.

ఐసియులు అన్ని పరిశీలించి డిఎం విధుల్లో ఉన్నది లేనిదీ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా న్యూరో, సర్జికల్, ఆరోగ్యశ్రీ, మేల్ మెడికల్, సర్జికల్, ఫీమేల్ మెడికల్, సర్జికల్ వార్డులు తనిఖీ చేసి, రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

భోజన సదుపాయం అందరికి అందుతున్నది, లేనిది, మెనూ విషయమై అడిగి తెలుసుకున్నారు.పాయిజన్ కేసు వస్తే, వైద్యాధికారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులకు పేదవారు వస్తారని, మెరుగైన సేవలు అందించాలని అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని, వీటిని ప్రజలు వినియోగించుకొనేలా చూడాలని, ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ అన్నారు.

Advertisement

ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.బి.వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు డా.వీణ, డా.నాగరాజు, సిబ్బంది తదితరులు ఉన్నారు .

మోకాళ్ల నొప్పులకు 20 నిమిషాల్లో చెక్.. ఫిట్‌నెస్ ట్రైనర్ సీక్రెట్ రొటీన్ లీక్!
Advertisement

తాజా వార్తలు