ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.బలవంతంగా హిందీ భాషను రుద్దాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ లేఖ రాశారు.
ఐఐటీ, ఎన్ఐటీ లాంటి విద్యాసంస్థల్లో హిందీ మాధ్యమంలోనే విద్యాబోధన జరగాలన్న అమిత్ షా కమిటీ నివేదిక సరికాదని పేర్కొన్నారు.ప్రాంతీయ భాషల్లో కేంద్ర ప్రభుత్వ పరీక్షలు నిర్వహించకపోవడం అన్యాయమని తెలిపారు.
ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.రాజ్యాంగం ఇచ్చిన హక్కుని కాలరాస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
మాతృభాషలో చదువుతున్న కోట్ల నుంచి ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నారని ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.







