ఎస్సీ స్టడీ సర్కిల్ ను పరిశీలించిన అదనపు కలెక్టర్

రాజన్న సిరిసిల్లలోని ఎస్సీ స్టడీ సర్కిల్ ను అదనపు కలెక్టర్ పూజారి గౌతమి( Collector Pujari Gautami ) మంగళవారం పరిశీలించారు.

మూడు నెలల ఫౌండేషన్ కోర్సు మే 1 వ తేదీ నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో సిరిసిల్లలోని ఎస్సీ స్టడీ సర్కిల్ లో భోజన, హాస్టల్, వసతి ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం అదనపు కలెక్టర్ ఐదు నెలల ఫౌండేషన్ కోర్సు లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడారు.స్టడీ సర్కిల్ ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లి, లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు.మూడు నెలల ఫౌండేషన్ కోర్సు కోసం మొత్తం 50 మంది దరఖాస్తు చేసుకున్నారని, 28 మంది యువతులు, 22 మంది యువకులు ఉన్నారని, వారందరికీ హాస్టల్, భోజన, వసతి వేరువేరుగా కల్పించామని ఎస్సీ స్టడీ సర్కిల్ ఇంచార్జీ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు.

ఇప్పటికే 5 నెలల ఫౌండేషన్ కోర్సు కొనసాగుతుందని వివరించారు.ఇక్కడ ఎస్సీ స్టడీ సర్కిల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
పదవి విరమణ పొందిన అధికారని సన్మానించి జ్ఞాపకం అందజేసిన ఎస్పీ..

Latest Rajanna Sircilla News