ఓటమి భయంతో కాంగ్రెస్( Congress ) నీచానికి దిగజారుతోందని బీజేపీ నేత బండి సంజయ్( Bandi Sanjay ) అన్నారు.ఫేక్ వీడియోలతో బీజేపీ ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా తెలియదని బండి సంజయ్ విమర్శించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) వ్యవహారశైలిని చూసి కాంగ్రెస్ నేతలే బెంబేలెత్తుతున్నారని చెప్పారు.
ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతోమంది మాదిగలు బలయ్యారని తెలిపారు.మాదిగ సమాజంపై అవాకులు పేలుతున్న మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.