"ఆడవాళ్లు మీకు జోహార్లు".. కీలక పాత్రల్లో ఎవర్ గ్రీన్ హీరోయిన్స్ !

టాలీవుడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు.ఈయన విభిన్న సినిమాలతో టాలీవుడ్ లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Adavallu Meeku Joharlu New Poster Released, Adavallu Meeku Joharlu, Sharwanand,-TeluguStop.com

హిట్లు ప్లాప్స్ తో సంభంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ పోతున్నాడు.ప్రస్తుతం శర్వానంద్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు‘ సినిమా చేస్తున్నాడు.

ఇందులో టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుండే ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇది ఆడవాళ్ళ గురించే అని స్పష్టంగా అర్ధం అవుతుంది.ఇది ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా బాగా నచ్చే సినిమా అని దర్శకుడు చెబుతున్నాడు.

ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదల అయినా పోస్టర్ సినిమాపై మంచి హైప్ ఏర్పడేలా చేసాయి.

తాజాగా ఈ సినిమాపై చిత్ర యూనిట్ ఒక అప్డేట్ ఇచ్చారు.ఇందులో ఎవర్ గ్రీన్ హీరోయిన్స్ ముగ్గురు పాలుపంచుకో బోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.వాళ్ళు ఎవరో కాదు.రాధికా శరత్ కుమార్, ఊర్వశి, ఖుష్బూ.

ఇందులో నటించ బోతున్నట్టు తెలిపారు.కీలక పాత్రలు కోసం వీరిని ఏమికా చేసుకున్నట్టు తెలుస్తుంది.

వీళ్ళ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అందరు నటనలో జీవిస్తారు.

Telugu Adavallumeeku, Kavitha Ranjini, Kushboo, Sharwanand-Movie

అందుకే వీరిని ఎంచుకున్నట్టు టాక్.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.ఇప్పటికే రాధికా శరత్ కుమార్, ఊర్వశి, ఖుష్బూ ముగ్గురు నటీమణులు కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యారట.ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేసి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

చూడాలి మరి ఈ సినిమాతో శర్వానంద్ ఎంత పెద్ద సక్సెస్ అందుకుంటాడో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube