పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం సాలిడ్ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్నాడు.మరి పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో హరీష్ శంకర్ తో ”ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh) మూవీ కూడా ఉంది.
ఈ ప్రాజెక్ట్ పై అప్పుడే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చాడు.
ఈ సినిమా వీరిద్దరి కెరీర్ కు చాలా ప్లస్ అయ్యింది.
ఇక ఇప్పుడు మరోసారి ఇదే కాంబో రిపీట్ కాబోతుంది.దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ కాంబో కోసం ఈగర్ గా వైట్ చేస్తున్నారు.వారం రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్టు హరీష్ శంకర్ అధికారికంగా తెలిపాడు.
వీలైనంత ఫాస్ట్ గా ఈ సినిమాను పూర్తి చేయబోతున్నాడు.ఇదిలా ఉండగా మొన్న ఈ సినిమా నుండి అదిరిపోయే ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
పవర్ స్టార్ పోలీస్ గెటప్ లో ఉన్న ఈ ప్రీ లుక్ పోస్టర్ తో హైప్ బాగా పెరిగింది.మరి ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అని అంటున్నారు.కానీ అధికారికంగా మాత్రం ఎటువంటి క్లారిటీ అనేది రాలేదు.ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుపు కుంటుంది.మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూట్ లో యంగ్ బ్యూటీ జాయిన్ అయినట్టు తెలుస్తుంది.
ఆమె మరెవరో కాదు. శ్రీలీల (Sreeleela) అని తెలుస్తుంది.యంగ్ బ్యూటీ శ్రీలీల తాజాగా ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అవ్వగా ఆమె మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.
మరి హరీష్ (Harish Shankar) ఈమె పాత్రను ఎలా చిత్రీకరించారో వేచి చూడాలి.ఇదిలా ఉండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.