తాజాగా బెంగళూరు- లక్నో మధ్య జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగి లక్నో విజయం( Lucknow Super Giants ) సాధించింది.అయితే ఈ మ్యాచ్ లో పేలవ ప్రదర్శన చేసిన కేఎల్ రాహుల్ ప్రస్తుతం అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
లక్నో జట్టు కెప్టెన్ గా రాహుల్( KL Rahul ) దుమ్ములేపే ఆట ప్రదర్శన చేస్తాడు అనుకుంటే ఫామ్ కోల్పోయి తడబడుతూ స్లో బ్యాటింగ్ తో అందరినీ నిరాశపరిచాడు.
తాజాగా బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓపెనర్ గా వచ్చిన రాహుల్ 12 ఓవర్ల వరకు క్రీజూ లో ఉండి 20 బంతుల్లో 18 పరుగులు చేశాడు.జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు దానిని ఎక్కించే బాధ్యత కెప్టెన్ పై ఉంటుంది.
కానీ అందుకు విరుద్ధంగా పేలవ ప్రదర్శన చేసిన కేఎల్ రాహుల్ సోషల్ మీడియాలో మీమ్స్ తో పాటు సెటైర్లు లను ఎదుర్కొంటున్నాడు.అయితే తన స్లో బ్యాటింగ్ పై కేఎల్ రాహుల్ స్పందిస్తూ పరిస్థితిని బట్టి నిదానంగా ఆడానని, జట్టు వికెట్లు కోల్పోతూ ఉండడంతో చివరి వరకు నిలబడి ఆడాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.
అయితే సోషల్ మీడియాలో అభిమాను
లు కేఎల్ రాహుల్ ఆట ప్రదర్శన టెస్ట్ మ్యాచ్ ల ఉందంటూ.ఐపీఎల్ లో ఇలా జిడ్డుగా బ్యాటింగ్ చేయడం జట్టును కష్టాల్లోకి నెట్టుతుందని విమర్శిస్తున్నారు.213 పరుగుల లక్ష్య చేదనకు దిగిన లక్నో జట్టు ఓడిపోయే పరిస్థితులు ఏర్పడినప్పుడు మెన్ పురాన్ ( Nicholas Pooran )12 బంతుల్లో అర్థ సెంచరీ చేయడంతో లక్నో జట్టు మ్యాచ్ గెలిచింది.చివరి బంతి వరకు సాగిన మ్యాచ్ డ్రా అవుతుందనే అనుకున్నారు.కాని చివరి బంతి లెగ్ బైస్ తో ఒక పరుగు రావడంతో లక్నో విజయం సాధించింది.
లక్నో జట్టు నాలుగు మ్యాచ్లలో మూడు మ్యాచులు గెలిచి లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకు వెళ్ళింది.