వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకమా.? అనుకూలమా.? అని ప్రశ్నించారు.
ప్రైవేటీకరణకు వ్యతిరేకం అయితే బిడ్డింగ్ లో ఎలా పాల్గొంటున్నారో చెప్పాలని మంత్రి అమర్నాథ్ అన్నారు.ఏడాదిన్నర క్రితం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక మెమోరాండం ఇచ్చిందన్నారు.
దాని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిడ్డింగ్ లో పాల్గొనే అవకాశం లేదని వెల్లడించారు.బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో అధికారులు లేదా ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని, స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలనేదే తమ స్టాండ్అని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.







