షూటింగ్ స్పాట్ కి తాగేసి వచ్చిన శృతి హాసన్..భరించలేక లొకేషన్ నుండి పారిపోయిన హీరో!

కమల్ హాసన్ లాంటి లెజెండ్ కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శృతి హాసన్( Shruti Haasan ) తండ్రికి తగ్గ తనయురాలు అని నిరూపించుకొని సౌత్ లోనే బిగ్గెస్ట్ లేడీ సూపర్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.

ఈమె టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్, రామ్ చరణ్ , అల్లు అర్జున్ , ఇప్పుడు లేటెస్ట్ గా ప్రభాస్ తో ఇలా అందరి టాప్ స్టార్స్ తో కలిసి సినిమాలు చేసేసింది.

ఇక తమిళం లో కూడా ఇదే పరిస్థితి, దాదాపుగా అందరి స్టార్ హీరో సినిమాల్లో నటించిన శృతి హాసన్ నాగార్జున మరియు వెంకటేష్ తో మాత్రం ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు.త్వరలో వాళ్ళతో కూడా ఈమె నటించేస్తుంది అని చెప్పొచ్చు.

అయితే ఇంత మంది హీరోల సరసన నటించేందుకు ఆమె తన తండ్రి పేరు ఏమాత్రం ఉపయోగించుకోలేదు, కేవలం ఆమెకి ఉన్న టాలెంట్ తోనే ఈ రేంజ్ కి వచ్చింది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.

అయితే ప్రతీ మనిషిలో ఉన్నట్టుగానే శృతి హాసన్ లో కూడా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయట.ఆమెకు పార్టీ కల్చర్ అంటే బాగా ఇష్టం, ప్రతీ రోజు మందు త్రాగే అలవాటు( Drinking Habit ) కూడా ఉండేదట.ఒకానొక సమయం లో షూటింగ్ కి ఆమె ఫుల్ గా తాగేసి వచ్చిందట.

Advertisement

ఆమె మాట్లాడుతున్నప్పుడల్లా ఆమె నోటి నుండి వచ్చే వాసన చూసి ఈమె తాగేసి వచ్చింది అని అందరికీ అర్థం అయ్యేది అట.ఒక హీరో కి అలాంటి అనుభవమే ఎదురై ఆరోజు షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసి వెళ్ళిపోయాడట.శృతి హాసన్ కి ఇది అప్పట్లో ఘోరమైన అవమానం గా భావించొచ్చు అని ఒక వార్త జోరుగా ప్రచారం అయ్యింది.

ఇక ఈ సంఘటన జరిగినప్పటి నుండి శృతి హాసన్ మద్యం అలవాటుని పూర్తిగా మానేసిందట .ఎప్పుడైనా స్నేహితులు కలిసినప్పుడు మాత్రమే తాగుతుందట .

ఇకపోతే శృతి హాసన్ రీసెంట్ గానే ఇండియా లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సలార్( Salaar ) చిత్రం లో హీరోయిన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమా కోసం అభిమానులు మరియు ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో మాటల్లో చెప్పలేం .ఈ చిత్రం నుండి ఏ చిన్న న్యూస్ బయటకి వచ్చిన సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది.అంతటి క్రేజీ ప్రాజెక్ట్ లో శృతి హాసన్ నటించింది, ఈ సినిమా హిట్ అయితే ఆమె రేంజ్ మామూలు స్థాయిలో ఉండదు.

క్రాక్ సినిమా( Krack Movie ) నుండి ఆమె చేసిన ప్రతీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపేస్తున్నాయి.ఈ సినిమా ఏ రేంజ్ బాక్స్ ఆఫీస్ విద్వంసం సృష్టిస్తుందో చూడాలి.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు