బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న హీరోయిన్ శిల్పా శెట్టి.ఇకపోతే శిల్పాశెట్టికి ఆభరణాలు అంటే చాలా మక్కువ.
తన దగ్గర ఉన్న అద్భుతమైన జ్యువలరీ కలెక్షన్ ను వివిధ కార్యక్రమాల్లో మనం చూస్తూనే ఉంటాం.ఇకపోతే ఈవిడ తాజాగా తనవద్దనున్న 20 క్యారెట్ల డైమండ్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తన అభిమానులతో పంచుకుంది.
తన దగ్గర ఉన్న ఎన్నో విలువైన ఆభరణాలలో అతి ముఖ్యంగా భావించే ఈ వజ్రాన్ని తన కొడుకు వియాన్ రాజ్ కుంద్రాకు కి కాబోయే భార్య మాత్రమే చెందుతుందని అందుకు తాను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.కాకపోతే ఓ చిన్న షరతు కూడా పెట్టింది అండోయ్.
అదేమిటంటే.తన కాబోయే కోడలు తనతో సఖ్యతగా మెలిగితేనే తన వజ్రం పొందేందుకు ఆ అమ్మాయి అర్హురాలని, లేదంటే.కేవలం చిన్న చిన్న ఆభరణాల తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుందని తన కొడుకు వియాన్ తో సరదాగా చెబుతుంటాను అని తెలిపింది.వీటితో పాటు ఎవరైనా తన ఇంస్టాగ్రామ్ ను చూస్తే తాను అమ్మతనానికి ఎంత ప్రాధాన్యత ఇస్తానో అందులో తెలిసిపోతుంది అంటూ ఆవిడ తెలిపింది.ఇకపోతే ఆభరణాల గురించి ఆవిడ మాట్లాడుతూ ఆభరణాల అనేవి వారసత్వాన్ని కొనసాగిస్తాయని తాను నమ్ముతున్నానని అందుకే ఎక్కువగా వాటిని కొనుగోలు చేస్తా అంటూ ఆవిడ చెప్పుకొచ్చింది.2009లో నటి శిల్పాశెట్టి రాజ్ కుంద్రాను వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ జంటకి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.వీరిద్దరూ ఎప్పుడు ఎక్కడ బయట కార్యక్రమానికి హాజరైన ఎంతో అందంగా కనిపిస్తారు.వీరిద్దరి ప్రేమకు సంబంధించిన అలనాటి మధురానుభూతులను కూడా నటి శిల్పాశెట్టి ఇదివరకు ఓ వీడియో రూపంలో పంచుకున్న సంగతి అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.అందులో పారిస్ నగరం లోని లే గ్రాండ్ హోటల్ లో ఒక హాలు మొత్తాన్ని ఆయన బుక్ చేసి తన ముందర మోకాళ్లపై కూర్చుని డైమండ్ రింగ్ తో ప్రపోజ్ చేసిన విధానాన్ని ఆవిడ అందులో తెలిపింది.
అంతేకాకుండా ఆ వీడియోలో మరిన్ని విషయాలు తెలుపుతూ చివరికి వీడియోను తనదైన శైలిలో ముగించింది.