తొమ్మిదిసార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్.. భరించలేని బాధ అంటూ?

పెళ్లైన ప్రతి ఒక్క మహిళకు తల్లి కావాలనే కోరిక బలంగా ఉంటుంది.అయితే గర్భవతి అయిన తర్వాత ఏదైనా కారణం చేత అబార్షన్ అయితే మాత్రం ఆ బాధ మామూలుగా ఉండదనే సంగతి తెలిసిందే.

 Actress Sharon Stone Reveals She Lost 9 Children Miscarriage Details, Sharon Sto-TeluguStop.com

సాధారణ మహిళలతో పాటు సెలబ్రిటీ మహిళలు మాత్రం అమ్మ అని పిలిపించుకోవడం కొరకు కొన్నిసార్లు కెరీర్ ను త్యాగం చేసిన సందర్భాలు ఉన్నాయి.ఏ కారణం చేతనైనా అమ్మా అనే పిలుపుకు తల్లి దూరమైతే ఆ బాధ మామూలుగా ఉండదు.

అయితే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న షరాన్ స్టోన్ పిల్లలను కోల్పోవడం గురించి చెబుతూ తన బాధను పంచుకున్నారు.తాను గర్భస్రావం వల్ల తొమ్మిది మంది పిల్లలను కోల్పోయానని ఆమె చెప్పుకొచ్చారు.

ఈ విషయం చిన్న విషయం కాదని ఆమె తెలిపారు.తాను మానసికంగా శారీరకంగా ఎంతో బాధను అనుభవించానని ఆమె కామెంట్లు చేశారు.

మహిళలుగా ఈ నష్టం గురించి మాట్లాడాలంటే పదాలు సరిపోవని ఆమె చెప్పుకొచ్చారు.

ఈ బాధ ఒంటరిగా రహస్యంగా భరించాల్సిన విషయం అని ఆమె కామెంట్లు చేశారు.

Telugu Times, Actresssharon, Hollywood, Mis Carriage, Sharan Stone, Sharonstone-

ఇలాంటి అనుభవాలు ఎదురైతే ఒక రకంగా ఒంటరి భావనను కలిగి ఉంటామని ఆమె అన్నారు.ఇలాంటి అనుభవాలు ఎదురైన సమయంలో ప్రేమ, సానుభూతి అవసరం అని ఆమె కామెంట్లు చేశారు.షరాన్ స్టోన్ తన మొదటి గర్భస్రావం గురించి మాట్లాడుతూ అలా జరిగిన సమయంలో చాలా సిగ్గు పడ్డానని తెలిపారు.

Telugu Times, Actresssharon, Hollywood, Mis Carriage, Sharan Stone, Sharonstone-

ఆ సమయంలో ఎంతో అవమానకరంగా అనిపించిందని ఆమె చెప్పుకొచ్చారు.గర్భస్రావం గురించి మాట్లాడాలంటే నా నోటి నుంచి మాటలు కూడా రావడం లేదని ఆమె కామెంట్లు చేశారు.తాను ప్రతిరోజూ వ్యాయామం చేస్తానని అయితే ఆ వ్యాయామం పునరుత్పత్తి కోసం ఉపయోగపడలేదని ఆమె చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube