పెళ్లి పీటలు ఎక్కబోతున్న సాయి పల్లవి

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి( sai Pallavi) ప్రస్తుతం తెలుగు లో టాప్ హీరోయిన్ అనే చెప్పాలి ఆమె సినిమా చేయడానికి సామాన్యం గా ఒప్పుకోదు ఒకవేళ ఒప్పుకుంది అంటే ఆ సినిమాలో ఏదో విషయం ఉందనే అర్థం.

ఇక మలయాళం ప్రేమమ్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చింది మాత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో.

ఈ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించారు.ఇందులో హీరో కంటే సాయి పల్లవి తన నటనతో అందరిని ఆకట్టుకొని స్టార్ హీరోయిన్గా మారిపోయింది.

ఇక సాయి పల్లవి ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా గ్లామరస్ పాత్రల్లో నటించకుండా సావిత్రి, సౌందర్య లాగా సాంప్రదాయబద్ధమైన పాత్రల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈమె గ్లామరస్ పాత్రల్లోనే కాదు మేకప్ కూడా వేసుకోదు.ఇక ఈ రోజుల్లో ఇలాంటి హీరోయిన్ ఉండడం నిజంగా సినీ ఇండస్ట్రీ చేసుకున్న పుణ్యం అని చెప్పుకోవచ్చు.ఫిదా సినిమా తర్వాత ఎంసీఏ, మారి 2, శ్యామ్ సింగరాయ్,లవ్ స్టోరీ, గార్గి,విరాటపర్వం, ఎన్ జి కే, పడి పడి లేచే మనసు వంటి సినిమాల్లో నటించింది.

Advertisement

తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.అయితే ఈ హీరోయిన్ నటించింది కొన్ని సినిమాలే అయినప్పటికీ కళ్ళు చెదిరే ఆస్తులు సంపాదించినట్టు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.

తాజాగా సాయి పల్లవి తన 31 వ బర్త్డేని చేసుకుంటుంది.ఇక సాయి పల్లవి బర్త్ డే సందర్భంగా ఆమె గురించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గార్గి సినిమా తర్వాత సాయి పల్లవి త్వరలోనే కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.సాయి పల్లవి అందరు హీరోయిన్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది.

ఆమె దగ్గర అందరు హీరోయిన్ల దగ్గర ఉన్నట్లు కాస్ట్లి వస్తువులు, బట్టలు అస్సలు ఉండవు.ఆమె కూడా మామూలు అమ్మాయిల లాగే వస్తువులను కొనుగోలు చేస్తుంది.ఇక సాయి పల్లవి దగ్గర ఆడి q3 మిక్స్బ్ షల్ లాన్సర్ ఈవో ఎక్స్ మరియు సుజుకి నెక్సా అనే కార్లు ఉన్నాయి.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

అంతేకాకుండా సాయి పల్లకి కోయంబత్తూర్ లో సొంత ఇల్లు కూడా ఉంది.ఇక సాయి పల్లవి ఇండస్ట్రీకి వచ్చిన ఇన్ని సంవత్సరాలలో 25 కోట్ల వరకు ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది.

Advertisement

ఇక తను ఒక్కొక్క సినిమాకి కోటి నుండి రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.ఇక ఇది ఇలా ఉంటే ఇంట్లో వాళ్ళు సాయి పల్లవి కి పెళ్లి చేయాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది.

ఇప్పటికే 30 ప్లస్ అయిన సాయి పల్లవి ని ఇంట్లో వాళ్ళు సినిమా లు పక్కన పెట్టీ ఇక పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వమంటున్నారు అనే విషయం తెలుస్తుంది.కానీ సాయి పల్లవి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదట రీసెంట్ గా ఒక సంబందం వస్తె సాయి పల్లవి దాన్ని రిజక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.

చూడాలి మరి సాయి పల్లవి పెళ్లి సెట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు