కూతురి గురించి చెబుతూ ఎమోషనల్ అయిన రోజా.. పిల్లలను చదివిస్తోందంటూ?

సీనియర్ స్టార్ హీరోయిన్, నగరి ఎమ్మెల్యే రోజాకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.

రోజా సినిమాలకు దూరమైనా ఆమెకు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.

రోజా సినిమాల ద్వారా, పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారనే సంగతి తెలిసిందే.అయితే తను సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని రోజా ఇతరులకు సహాయం చేయడం కోసం ఖర్చు చేస్తున్నారు.

రోజా కూతురు అన్షు మాలికకు కూడా ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.రోజా కూతురు సినిమాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నా ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారో లేదో స్పష్టత లేదనే సంగతి తెలిసిందే.

అయితే అన్షు మాలిక సేవా కార్యక్రమాల ద్వారా తన మంచి మనస్సును చాటుకుంటున్నారు.రోజా తన పిల్లల గురించి మాట్లాడుతూ తన పిల్లలు ఈ కాలంలో పుట్టాల్సిన పిల్లలు కాదని అన్నారు.

Advertisement

నా పిల్లలు మంచివాళ్లు అని నా పిల్లలు నన్ను అర్థం చేసుకున్న విధంగా ఎవరూ అర్థం చేసుకోరని రోజా చెప్పుకొచ్చారు.నా పిల్లలు అలా ఉండటానికి నా భర్త సెల్వమణి కూడా కారణమని రోజా కామెంట్లు చేశారు.

తల్లి విలువ పిల్లలకు తెలిసేలా సెల్వమణి చేశారని నన్ను మిస్ అవుతున్నాననే భావన వాళ్లకు కలగకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తానని ఆమె వెల్లడించడం గమనార్హం.

ఛీర్స్ ఫౌండేషన్ ద్వారా అన్షు మాలిక ఐదు మంది పిల్లలను చదివిస్తోందని చెప్పుకొచ్చారు.బర్త్ డే రోజున చీర్స్ ఫౌండేషన్ కు వెళ్లి అక్కడ ఐదు మంది పిల్లలను ఎంపిక చేసుకుందని రోజా పేర్కొన్నారు.ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తే తన కూతురు డొనేషన్స్ కలెక్ట్ చేసి పాఠశాలలో ఇస్తుందని రోజా చెప్పుకొచ్చారు.

పేద పిల్లలను ఇంటికి తీసుకొచ్చి తన కూతురు భోజనం పెట్టించిన సందర్భాలు ఉన్నాయని రోజా తెలిపారు.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు