రోజు రోజుకి అందంగా తయారవుతున్న రోజా కూతురు.. అంతా అందుకోసమేనా ?

ఒకప్పుడు తెలుగు తెరను ఏలిన నటి రోజా.తెలుగులోనే కాదు.తమిళ, కన్నడ సినిమా పరిశ్రమలోనూ సత్తా చాటింది.

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తాన్ని ఏలింది ఈ బరువైన అందాల భామ .ప్రస్తుతం ఆమె ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషిస్తుంది. వైసీసీ ఎమ్మెల్యేగా, ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తుంది.

అయితే ప్రస్తుతం ఆమె కూతురు హాట్ టాపిక్ గా మారింది.ఇంతకీ తన కూతరు విషయం ఎందుకు తెర మీదకు వచ్చింది అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రోజా, సెల్వమణి ముద్దుల కూతురు అన్షు మాలిక.ఈమెను త్వరలో హీరోయిన్ గా పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారట తల్లిదండ్రులు.ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్న రోజా.

Advertisement

బుల్లితెరపై మాత్రం సందడి చేస్తుంది.ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో ద్వారా జనాలను ఎంటర్ టైన్ చేస్తుంది.

అయితే సినిమాల్లో నటించేంత తీరిక తనకు దొరకడం లేదు.తన భర్త కూడా సినిమాలు చేయడం లేదు.

ఈ నేపథ్యంలో తన కూతురు ను హీరోయిన్ గా తెలుగు తెరకు ఇంట్రడ్యూస్ చెయ్యాలనుకుంటున్నరట.దీనికి సంబంధించి చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నారట.

అంతేకాదు.తన కూతురుకు యాక్టింగ్, డాన్సింగ్ లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారట.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

ఇప్పటికే రోజా డాటర్.అన్ని విషయాల్లో మంచి ప్రతిభ కనబరుస్తుంది.

Advertisement

ప్రస్తుతం అన్షు సినిమా ఎంట్రీకి సంబంధించి ఇప్పటికే తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయట.ఓ టాప్ హీరో తనయుడి మూవీలో హీరోగాయిన్ గా నటించేలా ప్లాన్ చేస్తున్నారట రోజా దంపతులు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధిచి చర్చలు కొనసాగుతున్నాయట.

అటు సెల్వమణి తమిళ సినిమా పరిశ్రమలోనూ తన బిడ్డను ఎంట్రీ ఇప్పించేలా ట్రై చేస్తున్నారట.త్వరలోనే అన్షు సినిమా ఎంట్రీకి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే 17 సంవత్సరాలు నిండిన రోజా డాటర్..

తన బర్త్ డే సందర్భంగా తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.అందంలో తల్లినే మించిపోయిందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.

తాజా వార్తలు