ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్ ఫొటోస్ ట్రెండ్ నడుస్తోంది.అయితే కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే అన్ని ఇండస్ట్రీలలో కూడా ఇదే ట్రెండింగ్ నడుస్తోంది.
సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ కి సంబంధించిన చిన్నప్పటి ఫోటోల ట్రెండ్ నడుస్తోంది.సెలబ్రిటీలు సైతం వారి చిన్నప్పటి జ్ఞాపకాలలో ఫోటోలను అభిమానులతో పంచుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో మరొక స్టార్ హీరోయిన్ కు సంబంధించిన చిన్నప్పటి ఫోటో వైరల్ అవుతుంది.
మరి ఆ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.
రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించి చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.మొదట కెరటం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.
ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోల సరసన నటించింది.అందులో భాగంగానే లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధ్రువ, లాంటి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్.
మొదట్లో వరుస అవకాశాలతో తారాజువ్వలా దూసుకుపోయిన ఈ భామకు ఆ తర్వాత సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.

టాలీవుడ్ తో పాటు అప్పుడప్పుడు బాలీవుడ్ లో కూడా మెరుస్తోంది.ఇకపోతే రకుల్ ఇటీవల తెలుగులో విడుదలైన కొండపొలం సినిమాలో నటించింది.దర్శకుడు క్రిష్ ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేయగా, ఈ చిత్రాన్ని ఫారెస్ట్‌లో ఎక్కువ శాతం చిత్రీకరించారు.
ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఓబులమ్మ పాత్రలో నటించింది.రకుల్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ తన అభిమానులకు చేరువగా ఉంటుంది.