కొలంబో ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న సీనియర్ హీరోయిన్

శ్రీలంక రాజధాని కొలంబో లో ఈ రోజు ఈస్టర్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులు అందరూ ప్రార్ధనలో మునిగిపోయి ఉన్న సమయంలో ఊహించని విధంగా ఉగ్రవాదులు వరుస పేలుళ్ళతో అల్లకల్లోలం సృష్టించారు.

మొత్తం 8 చోట్ల వరుసగా జరిగిన ఈ బాంబు దాడులలో ప్రజలకి తేరుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.

ఇక ఈ మారణహోమంలో ఇప్పటి వరకు 400 మృతి చెందగా వందల సంఖ్యలో క్షతగాత్రులు అయినట్లు తెలుస్తుంది.ఈ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికే ఖండించాయి.

అలాగే శ్రీలంకని ఆదుకోవడానికి ముందుకొస్తున్నాయి.అయితే ఈ ఉగ్రదాడికి పాల్పడింది ఎవరనే విషయం ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.

ఇదిలా ఉంటే ఈ ఉగ్ర దాడి నుంచి సినియర్ నటి రాధిక తృటిలో తప్పించుకున్నారు.బాంబు పేలుడు జరిగిన సిన్నామన్ గ్రాండ్ హోటల్ లోనే ఆమె కూడా బస చేశారు.

Advertisement

ఆయితే బ్లాస్ట్ కు కొద్ది నిమిషాల ముందు రాధిక హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయారు.కొద్ది క్షణాల వ్యవధితో ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు.

హెటల్ నుంచి బయటికి వెళ్లాక పేలుళ్ల గురించి తెలుసుకున్న రాధిక బ్లాస్టింగ్ తనకు షాకింగ్గా ఉందని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు