టాక్సీవాలా సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది ప్రియాంక జవాల్కర్ తొలి చిత్రం విజయం సాధించడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.వరుస అవకాశాలు అంది పుచ్చుకుంది.
ఇటీవలే విడుదలైన తిమ్మరుసు, ఎస్.ఆర్ కళ్యాణమండపం చిత్రాల్లో ప్రియాంక నటించింది.ఆ రెండు చిత్రాలకు ప్రేక్షకులు నుండి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ప్రియాంకకు నటిగా మరింత గుర్తింపు వచ్చింది.వరుసగా రెండు విజయవంతమైన చిత్రాల్లో నటించినందుకు ఆమెకు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి.
ప్రియాంక మీడియాతో ముచ్చటించింది.టాక్సీవాల తర్వాత గ్యాప్ వచ్చిన మాట నిజమే టాక్సీవాలా తరువాత నటించిన తిమ్మరుసు.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ లో విడుదలైన తొలి చిత్రం.ప్రేక్షకులు ఆదరించారు.
ఆ తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణమండపం ఆదరణ పొందింది.కరోనా సమయంలో ప్రేక్షకులు థియేటర్లకు సినిమాలకు వస్తారో రారో నేను భయం ఉండేది.
ప్రేక్షకులు మంచి సినిమాలను వీక్షించేందుకు థియేటర్లకు వస్తున్నారు.సినిమా నాకు మంచి పేరు తెచ్చింది.
ఆ తర్వాత కూడా చిత్రాల విషయంలో సెలెక్టివ్ గా ఉన్నాను.

గమనం సినిమాలో నా రోల్ చిన్నదే అయినా బాగా నచ్చి ఒప్పుకున్నాను.విమర్శలను ఆహ్వానిస్తాను.నేను నటించిన సినిమాలకు నా ఫ్రెండ్స్ పెద్ద క్రిటిక్స్.
ఎక్కడ బాగా చేశాను ఎక్కడ మిస్సయ్యాను వాళ్లే నాకు చెబుతుంటారు.నా మీద వచ్చే నెగిటివ్ ని తేలిగ్గా తీసుకుంటాను.
పాజిటివ్ మాత్రమే ఎంజాయ్ చేస్తాను.ఇప్పటిదాకా మంచి సినిమాల్లో నటించాను.
ఇక కూడా మరిన్ని మంచి పాత్రలు చేయాలని ఉంది.తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి ఫలానా తరహా పాత్రలు చేయాలని ఏమీ లేదు నాకు నచ్చిన పాత్రలు ఏదైనా చేస్తాను.
ప్రస్తుతం తమిళంలో సినిమాపై సైన్ చేశానని వెల్లడించింది.