గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతిరాయ్( Jyothi Roy ) హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.ఏ మాస్టర్ పీస్( A Master Piece ) అనే పేరిట ఓ సినిమా చేస్తున్నారు.
ఇక ఈ సినిమాకు దర్శకుడుగా ఆమె భర్త సుఖ పూర్వజ్( Sukh Purvaj ) దర్శకత్వం వహిస్తున్నారు.మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ అంశాలతో కూడిన సూపర్ హీరో మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నటి జ్యోతి రాయ్ మాట్లాడుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు.ఈ సినిమా తన జీవితంలో ఎంతో స్పెషల్ అని తెలిపారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తన పర్సనల్ లైఫ్ టర్న్ తీసుకుందని వెల్లడించారు.
ఈ సినిమా తర్వాత నాకు టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీ మెట్టినిల్లుగా మారిపోయిందని ఈమె వెల్లడించారు.ఇకపై తాను తెలుగులో వరుసగా సినిమాలు చేస్తాను అంటూ ఈ సందర్భంగా జ్యోతి రాయ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇలా జ్యోతి సినిమాలు వెబ్ సిరీస్ లు అంటూ కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్న తరుణంలోనే ఈమె గుప్పెడంత మనసు సీరియల్ నుంచి తప్పుకున్నారు.
గుప్పెడంత మనసు సీరియల్లో జగతి మేడం పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించిన జ్యోతి రాయ్ ప్రస్తుతం ఈ సీరియల్ కి దూరంగా ఉంటూ సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు.ఇక ఈమె ఇదివరకే పెళ్లి చేసుకొని ఒక బాబుకి జన్మనిచ్చినప్పటికీ ఆయనతో విడాకులు తీసుకొని యంగ్ డైరెక్టర్ తో ప్రేమలో పడటం తనని పెళ్లి చేసుకోవడం జరిగింది.ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె తరచు తన గ్లామర్స్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.ఇక ప్రస్తుతమైతే సీరియల్స్ కి స్వస్తి చెప్పిన ఈమె సినిమాలు వెబ్ సిరీస్ లో అంటూ కెరియర్ లో ఎంతో బిజీ అవుతున్నారు.