సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్టైతే అదే తరహా సినిమాలో నటించడానికి హీరోలు ఆసక్తి చూపిస్తారు.డైరెక్టర్లు సైతం అదే తరహా సినిమాలను తెరకెక్కిస్తే డైరెక్టర్లు హిట్ చేస్తారని భావిస్తారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) నటించిన కంత్రి, శక్తి, బాద్ షా సినిమాలు ఆశించిన రేంజ్ లో హిట్ కాకపోవడానికి ఆ సినిమాలకు ఇతర సినిమాలకు పోలికలు ఉండటమే అని చాలామంది ఫ్యాన్స్ ఫీలవుతారు.
ఎన్టీఆర్ నటించిన కంత్రి సినిమా( Kantri Movie ) పోకిరి సినిమాను పోలి ఉంటుంది.విచిత్రం ఏంటంటే కంత్రి సినిమాలోని కొన్ని డైలాగ్స్ సైతం పోకిరి సినిమాను గుర్తు చేస్తాయి.కంత్రి సినిమాలో హీరో డ్రెస్సింగ్ స్టైల్ కాని క్లైమాక్స్ ట్విస్ట్ కానీ పోకిరి సినిమాను గుర్తు చేస్తుందని చాలామంది భావిస్తారు.
కంత్రి సినిమా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కగా ఈ సినిమా నిర్మాతలకు ఒకింత భారీ నష్టాలను మిగిల్చింది.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమా( Sakthi Movie ) కూడా మగధీర స్పూర్తితో తెరకెక్కిందని చాలామంది ఫీలవుతారు.శక్తి సినిమాకు కూడా మెహర్ రమేష్ దర్శకుడు కావడం గమనార్హం.దాదాపుగా 45 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అత్యంత భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది.
ఈ సినిమా కూడా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కగా అశ్వనీదత్ కు ఈ సినిమా భారీ షాకిచ్చింది.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్ షా సినిమా( Baadshah ) కూడా దూకుడు సినిమాను పోలి ఉంటుంది.అయితే అటు దూకుడు సినిమాకు, ఇటు బాద్ షా సినిమాకు శ్రీను వైట్ల దర్శకుడు కావడం గమనార్హం.జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాల విషయంలో పొరపాట్లు చేయకుండా ఉండి ఉంటే ఈ సినిమాల రిజల్ట్ మరోలా ఉండేదని నెటిజన్లు చెబుతున్నారు.