నా జోలికి రావద్దని ఏఎన్నార్ కు చెప్పిన అప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో ఒకటైన గుండమ్మ కథ సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా రిలీజై 60 సంవత్సరాలు కావడం గమనార్హం.

ఈ సినిమా గురించి జమున మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.గుండమ్మ కథ టైటిల్ ను ఫిక్స్ చేసిన సమయంలో ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన రాలేదని ఆమె వెల్లడించారు.

ఆ సినిమా షూటింగ్ కు మూడు సంవత్సరాల ముందు నుంచి సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ తో తనకు మాటలు లేవని జమున చెప్పుకొచ్చారు.దారిన పోయే దానయ్యతో అయినా సినిమా చేస్తాను కానీ మీతో సినిమా చేయనని ఆ సమయంలో తాను అన్నానని ఆమె చెప్పుకొచ్చారు.

పాత రోజులలో ఆత్మాభిమానం ఎక్కువగా ఉండేదని ఆమె కామెంట్లు చేశారు.ఏఎన్నార్ తో ఇబ్బందులు పడటం వల్ల ఆయనతో సినిమాలు చేయలేదని జమున తెలిపారు.

Advertisement
Jamuna Comments About Akkineni Nageswara Rao Details, Gundamma Katha, Jamuna, Ak

అది నా ప్రతిభకు సరిపడా పాత్ర కాకపోయినా మామూలు చిలిపి అమ్మాయి పాత్రలో నటింపజేశారని ఆమె చెప్పుకొచ్చారు.

Jamuna Comments About Akkineni Nageswara Rao Details, Gundamma Katha, Jamuna, Ak

సావిత్రి పొగరుగా నటిస్తే ఎవరూ ఒప్పుకోరని జమున ఏడుపుగొట్టు పాత్రల్లో నటిస్తే ప్రేక్షకులు అంగీకరించరని ఆమె కామెంట్లు చేశారు.సూర్యకాంతం నాకు బాగా క్లోజ్ అని పెద్ద క్యారియర్ తెచ్చి దగ్గరుండి ఆమె తినిపించేదని జమున చెప్పుకొచ్చారు.గుండమ్మ కథ అనుభవాలను తలచుకుంటే కళ్లు చెమ్మగిల్లుతాయని జమున కామెంట్లు చేశారు.

Jamuna Comments About Akkineni Nageswara Rao Details, Gundamma Katha, Jamuna, Ak

ఆ సినిమాలో నటించిన వాళ్లలో చాలామంది ప్రస్తుతం జీవించి లేరని ఆమె కామెంట్లు చేశారు.గుండమ్మ కథ అప్పట్లో కలెక్షన్ల విషయంలో కూడా రికార్డులు సృష్టించింది.నాగిరెడ్డి గారు, చక్రపాణిగారు అంత గొప్ప సినిమాను తీశారు.

గుండమ్మ కథ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చాలామంది భావిస్తున్నారు.అయితే ఈ సినిమా రీమేక్ సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు