భోజనానికి కూర్చుంటే అందరి ముందు అవమానించాడు.. హేమ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో ఒకరైన హేమ వరుసగా సినిమా ఆఫర్లను అందుకుంటున్నారు.

కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విజయాలు అందుకుంటున్న హేమ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటీమణులలో డబ్బును సంపాదించి పోగొట్టుకున్న వాళ్లు ఎక్కువ మంది ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే తనకు మాత్రం పెళ్లికి ముందు నుంచి డబ్బు విషయంలో జాగ్రత్త ఉందని ఆమె పేర్కొన్నారు.నాన్నకు ఇద్దరు భార్యలు అని మొత్తం ఆరుగురు పిల్లలమని రెండెకరాల భూమిలో నాన్న వ్యవసాయం చేయడంతో పాటు ముఠామేస్త్రిగా కూడా పని చేశారని చెప్పుకొచ్చారు.

నాన్న సంపాదనతో కుటుంబాన్ని పోషించడం సులువు కాదని అమ్మ తెలివి తేటలతో వడ్డీ వ్యాపారం చేసి డబ్బు సంపాదించిందని హేమ అన్నారు.మన కుటుంబ సమస్యలు మనకు తెలుస్తాయని ఏదైనా సినిమాకు వెళ్లాలన్నా నేల టికెట్ కు వెళ్లేవాళ్లమని హేమ వెల్లడించారు.

నాన్నకు మద్యం తాగే అలవాటు కూడా ఉండేదని ఆమె అన్నారు.అయితే పిల్లలం మాత్రం కలిసే పెరిగామని హేమ తెలిపారు.

Actress Hema Emotional Comments Goes Viral In Social Media Details, Hema, Charac
Advertisement
Actress Hema Emotional Comments Goes Viral In Social Media Details, Hema, Charac

తాను గడ్డి కోయడానికి వెళ్తే అమ్మ తిట్టేదని హేమ చెప్పుకొచ్చారు.తాను చదవ మంటే నిద్రపోతానని ఇతరులు చెబితే మాత్రం బాగా వింటానని హేమ అన్నారు.నాచురల్ గా యాక్ట్ చేయడానికి తాను ఇష్టపడతానని హేమ కామెంట్లు చేశారు.

జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో తాను శ్రీదేవికి డూప్ గా చేశానని ఆమె చెప్పుకొచ్చారు.

Actress Hema Emotional Comments Goes Viral In Social Media Details, Hema, Charac

భారతనారి అనే సినిమా షూటింగ్ బ్రేక్ సమయంలో ప్లేట్ లో భోజనం పెట్టుకున్న తర్వాత జయరామ్ అనే వ్యక్తి వచ్చి అక్కడికి వెళ్లి తిను అంటూ అవమానించారని అందరి ముందు అలా అరవడంతో తాను టేబుల్ లేపి విసిరి కొట్టానని హేమ వెల్లడించారు.ఏం మాట్లాడుతున్నావ్ రా అన్నం తినే సమయంలో అమ్మాయితో ఇలా మాట్లాడతావా అని అన్నానని హేమ కామెంట్లు చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు