తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అంజలి తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జర్నీ సినిమాలలో నటించి నటించి మెప్పించింది.
అంజలి హీరోయిన్ గా నటించడమే కాకుండా అప్పుడప్పుడు సినిమాలలో ఐటమ్ సాంగ్ లతో కూడా మెరుస్తూ ఉంటుంది.టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలలో నటించి టాప్ హీరోయిన్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.
కానీ తమిళ హీరో జై తో ప్రేమాయణం కారణంగా అక్కడ చెలరేగిన వివాదాలతో ఆమె కెరియర్ గాడి తప్పింది.
అంజలి ఇటీవలే టాలీవుడ్ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఐటమ్ సాంగ్ తో మెప్పించిన విషయం తెలిసిందే.
కానీ ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.అయితే ఈ మధ్య కాలంలో సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ లలోనే ఎక్కువగా నటిస్తోంది.
కాగా తాజాగా అంజలి నటించిన ఫాల్ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.దాంతో ఆ వెబ్‌సిరీస్ సంబంధించిన ప్రచారంలో భాగంగా ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొంది.
ప్రచారంలో భాగంగా అంజలి మీడియా ముందుకు వచ్చింది.
ఈ నేపథ్యంలో ఆమె పెళ్లి గురించి ఓ ప్రశ్న ఎదురైంది.దాంతో నవ్వేసిన అంజలి ఇప్పటికే నా పెళ్లి గురించి రకరకాల వార్తలు వచ్చాయి.నేను అమెరికాలోని బిజినెస్‌మెన్‌ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిలైపోయినట్లు కూడా రాశారు.
కానీ అదంతా అబద్ధం.ఇప్పటికైతే నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు.
కానీ రాబోవు రోజుల్లో తప్పకుండా వివాహం చేసుకుంటా.ఆ టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ చెప్తాను అని చెప్పుకొచ్చింది అంజలి.
అయితే ఇదివరకు లావుగా బొద్దుగా ఉన్న అంజలి ఈ మధ్యకాలంలో చాలా స్లిమ్ గా తయారై గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన విషయం తెలిసిందే.