సినిమా రంగంలో సుధీర్ఘ కాలం కెరీర్ ను కొనసాగించడం తేలిక కాదనే సంగతి తెలిసిందే.అయితే మోడల్ కమ్ నటి దీపికా పదుకొనే మాత్రం ఇప్పటికీ వరుస ఆఫర్లతో కెరీర్ ను అదుర్స్ అనేలా ప్లాన్ చేసుకుంటూ అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ బ్యూటీ పఠాన్ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా కోసం దీపిక ఏకంగా 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను అందుకున్నారని సమాచారం.
దీపికా పదుకొనే సాధారణంగా తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఈ సినిమా కోసం 50 శాతం ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ను తీసుకున్నారని బోగట్టా.గతంలో పలు సినిమాలలో బికినీ ధరించి అందంగా కనిపించిన దీపిక పఠాన్ సినిమాలో బికినీ ధరించి ఊహించని స్థాయిలో అందాల ప్రదర్శన చేశారని సమాచారం అందుతోంది.
షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా షారుఖ్ ఖాన్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

గత కొన్నేళ్లుగా వరుస సినిమాలు భారీ షాకులిచ్చిన నేపథ్యంలో షారుఖ్ ఖాన్ కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జోడీకి ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో గుర్తింపు ఉండటంతో ఈ కాంబోలో వచ్చే సినిమా సక్సెస్ సాధించాలని షారుఖ్ దీపిక అభిమానులు కోరుకుంటున్నారు.సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ కానుంది.2023 జనవరి 25వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందో లేక షారుఖ్ ఖాతాలో మరో ఫ్లాప్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.బికినీ అందాలతో యూత్ ను ఆకట్టుకోవాలనే దీపిక ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో తెలియాలంటే మరో 40 రోజులు ఆగాల్సిందే.
రికార్డు స్థాయిలో థియేటర్లలో పఠాన్ మూవీ రిలీజ్ కానుందని బోగట్టా.







