తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లో తాజాగా 14వ వారం ఎలిమినేషన్ లో భాగంగా హౌస్ లో నుంచి ఇనయ ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చిన విషయం తెలిసిందే.అయితే ఇనయ ఎలిమినేట్ అవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
టాప్ 2 లో ఉంటుంది అనుకున్న కంటెస్టెంట్ ఇనయ ని ఈ విధంగా ఎలిమినేట్ చేసి బయటకు పంపించడంతో అభిమానులు బిగ్ బాస్ షోపై షో నిర్వాహకుల పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.దీనికంటే చెత్త సీజన్ మరొకటి లేదు అంటూ మండిపడుతున్నారు.
ఇతర కంటెస్టెంట్ లను సేవ్ చేయడం కోసం ఇనయ కావాలనే ఎలిమినేట్ చేశారు అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి ఇనయ బిగ్ బాస్ కేఫ్ లో పాల్గొంది.
ఈ క్రమంలోనే యాంకర్ శివకు దిమ్మ తిరిగే రేంజ్ లో కౌంటర్లు ఇచ్చింది ఇనయ.ఎప్పుడు తన కామెంట్స్ తో అందర్నీ ఆడుకునే యాంకర్ శివకు ఇచ్చి పడేసింది ఇనయ.ఈ సందర్భంగా యాంకర్ శివ ప్రశ్నిస్తూ.ప్రతిసారి టైటిల్ విన్నర్ నేనే అని ఎందుకు అరిచేదానివి? అని ప్రశ్నించగా నా మీద నాకున్న నమ్మకంతోనే అలా అరిచాను అని తెలిపింది ఇనయ.ఆ తరువాత సూర్యతో లవ్ ట్రాక్ వల్ల నీ గ్రాఫ్ తగ్గింది అని శివ అనగా వెంటనే ఇనయ నేను అతడిని ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా చెప్పానా? అని తిరిగి ప్రశ్నించడంతో దెబ్బకి శివ మౌనంగా ఉండి పోయాడు.సూర్య గురించి రేవంత్ దగ్గర ఎందుకు బ్యాక్ బిచ్చింగ్ చేశావని అడగ్గా.

అది బ్యాక్ బిచ్చింగ్ కాదు, అప్పుడు కోపంలో అలా చెప్పానంటూ సమాధానం ఇచ్చింది .అంటే నీకు నచ్చినప్పుడు బాగా మాట్లాడతావు, నచ్చకపోతే ఎన్ని స్టేట్‌మెంట్లైనా వదులుతావు అంతేనా? అని శివ అనగా.వెంటనే ఇనయ ఎన్ని స్టేట్‌మెంట్లు కాదు, అప్పుడనిపించింది మాత్రమే చెప్తాను అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చింది.అనంతరం రేవంత్ గురించి చెప్పమని శివ అడగడంతో అతడు ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తాడు సమాధానం ఇవ్వగా వెంటనే అచ్చం నీలాగే కదా అని సెటైర్ వేయడంతో తన గురించి అడిగినప్పుడు మధ్యలో నన్నెందుకు తీసుకొస్తున్నావు అంటూ మండిపడింది ఇనయ.నేనూ, తను ఒకేలా ప్రవర్తిస్తామా? అని ప్రశ్నించగా నాకు తెలీదని బదులిచ్చాడు శివ.మరి తెలియనప్పుడు నా గురించి ఎందుకు చెప్పావని ఎదురు తిరిగింది.ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రేక్షకులు అభిమానులు ప్రతి ఒక్కరినీ చులకన చేసి మాట్లాడుతున్న శివకు ఇనయ సరిగ్గా బుద్ధి చెప్పింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.







