సినిమాలో కంటెంట్ బలంగా ఉంటే చాలు చిన్న సినిమా అయినా పెద్ద విజయాన్ని అందుకుంటుందని ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించాయి.ఇలా కంటెంట్ బలంగా ఉండడంతో ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నటువంటి సినిమాలలో ది కేరళ స్టోరీ( The Kerala Story ) ఒకటి.
డైరెక్టర్ సుదీప్తో సేన్ దర్శకత్వంలో ఆదాశర్మ ( Aadh Sharma ) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కేవలం 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి పాన్ ఇండియా స్థాయిలో సుమారు 350 కోట్ల వరకు కలెక్షన్లను సాధించి సంచలన విజయాన్ని అందుకుంది.

కేరళలోని కొంతమంది యువతులను ఇస్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించే నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత కొన్ని విమర్శలను అవంతరాలను కూడా ఎదుర్కొంది.అయితే ఆ విమర్శలను దాటుకొని ఈ సినిమా సంచలనమైన విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా చూసినటువంటి కొందరు సినీ ప్రముఖులు కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు.ఇలా థియేటర్లలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమా విడుదల ఈ 50 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల కాలేదు.

ఈ సినిమా విడుదల అవుతుంది అంటూ డేట్స్ కూడా ప్రకటించినప్పటికీ ఇంకా డిజిటల్ మీడియాలో ప్రేక్షకులకు అందుబాటులోకి రాకపోవడంతో ఎంతోమంది ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీ విడుదల ( Ott Release ) కాకపోవడానికి గల కారణాలను నటి ఆదాశర్మ తెలియజేశారు.ఈ సందర్భంగా ఈమె స్పందిస్తూ ది కేరళ స్టోరీ సినిమా అందరిదీ.అయితే ఈ సినిమాని ఏ ఓటీటీలో ప్రసారం చేయాలా అన్న ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని తెలిపారు.
మంచి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కు ఇస్తే ప్రేక్షకులకు మరింత రీచ్ అవుతుంది.అందుకే నిర్మాతలు ఈ మూవీ రిలీజ్ పై ఆలోచిస్తున్నారనీ ఆదా శర్మ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.