ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేసిన విజయ్ సేతుపతి.. వేతనం ఎంతంటే..?

ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో 96 మూవీతో పాటు ఇతర సినిమాలతో పాపులారిటీని సంపాదించుకున్న విజయ్ సేతుపతి పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

విలక్షణ పాత్రలు చేస్తూ ఎలాంటి పాత్రలోనైనా ఒడిగిపోయే టాలెంట్ ఉన్న విజయ్ సేతుపతి డేట్లు దొరకడం నిర్మాతలకు కష్టంగా మారింది.

విజయ్ సేతుపతి తమ సినిమాల్లో నటిస్తే తమ సినిమాలకు పాన్ ఇండియా సినిమాలుగా గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు.త్వరలో ఈ విలక్షణ నటుడు బుల్లితెరపై కూడా సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఇతర భాషల్లో హిట్టైన మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ తమిళంలో విజయ్ సేతుపతి హోస్ట్ గా త్వరలో ప్రసారం కానుంది.మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేసిన విజయ్ సేతుపతి సినిమాల్లోకి రాకముందు తన జీవితంలో ముఖ్య విషయాల గురించి చెప్పుకొచ్చారు.

కుటుంబ పోషణ కొరకు తాను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేశానని విజయ్ సేతుపతి న్నారు.

Advertisement

ఆ సమయంలో తన వేతనం కేవలం 750 రూపాయలని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న విజయ్ సేతుపతి కొన్నేళ్ల క్రితం తన దీనస్థితి గురించి చెప్పుకొచ్చారు.అర్ధరాత్రి వరకు తాను అక్కడే పని చేశానని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేయడం వల్ల జీతం రావడంతో పాటు ఆకలి కూడా తీరుతుందని తాను భావించానని విజయ్ అన్నారు.

ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేసిన తరువాత తాను టెలీఫోన్ బూత్ లో కూడా పని చేశానని విజయ్ సేతుపతి అన్నారు.తనకు ఉల్లి సమోసా ఎంతో ఇష్టమని ఇంట్లో ఉంటే స్వయంగా చేసుకుంటానని విజయ్ సేతుపతి చెప్పారు.ఈ ఏడాది విజయ్ సేతుపతి నటించి విడుదలైన ఉప్పెన మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు