Actor Vadivelu: ఆ మూవీలో అద్భుతంగా నటించిన వడివేలు.. జాతీయ అవార్డు ఖాయం అంటున్న ఫ్యాన్స్?

తెలుగు సినీ ప్రేక్షకులకు కమెడియన్ వడివేలు( Comedian Vadivelu ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఒకప్పుడు తెలుగు తమిళ కన్నడ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.

ఎన్నో సినిమాలలో కమెడియన్గా నటించిన కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు వడివేలు. తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరమైన వడివేలు ఇటీవల కాలంలో మళ్ళీ సినిమా ఇండస్ట్రీలకు ఎంట్రీ ఇచ్చి వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా విడుదలైన ఒక సినిమాలో వడివేలు అద్భుతమైన నటనలను కనబరిచారు.

ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఆ సినిమా మరేదో కాదు మామన్నన్.( Maamannan Movie ) ఉదయనిది స్టాలిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ లో నటించిన విషయం తెలిసిందే.

Advertisement

జూన్ 29న తమిళనాట విడుదలైన మామన్నన్పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు ఉదయనిధి స్టాలిన్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది.ఈ సందర్భంగా దర్శకుడికి మినీ కూపర్ కారుని బహుమతిగా ఇచ్చాడు ఉదయనిధి స్టాలిన్.

( Udayanidhi Stalin ) సినిమా చూసిన వారంతా వడివేలులో ఇంత మంచి నటుడు ఉన్నాడా! అంటూ ఆశ్చర్యపోతున్నారు.

దర్శకుడి ఆయన పాత్రను తీర్చి దిద్దిన విధానం, మామన్నన్ గా వడివేలు అసాధారణ నటనకు అంతా ఫిదా అవుతున్నారు.ఈ సినిమాలో వడివేలు నటనకు( Vadivelu Acting ) గాను ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.కొంతమంది వడివేలు నటనపై స్పందిస్తూ జాతీయ అవార్డు పక్క అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ఈ మూవీ చూసిన వారంతా మామన్నన్ లాంటి సీరియస్ క్యారెక్టర్‌లో వడివేలు అద్భుతంగా నటించారంటూ ప్రశంసిస్తున్నారు.ప్రముఖ మలయాళీ నటి మాల పార్వతి, వడివేలు నటనకు నేషనల్ అవార్డ్ వస్తుందని చెప్పారు.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు