Chiranjeevi Satya Prakash: ఆ నటుడికి కారు లేదని తెలిసి కారు కొనిచ్చిన చిరంజీవి.. మెగాస్టార్ మంచి మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) కేవలం రీల్ లైఫ్ లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంతోమందికి సహాయం చేసి హీరో అనిపించుకున్నారు.

ఇప్పటికే ఎంతోమందికి సహాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.

ఇక ఆయన చేసిన సహాయాన్ని చాలామంది ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.అలా మెగాస్టార్ ద్వారా సహాయం పొందిన వారిలో విలక్షణ నటుడు సత్యా( Actor Satya ) కూడా ఒకరు.

తెలుగులో ఎక్కువగా విలన్ పాత్రలలో ఎక్కువగా నటించి తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు నటుడు సత్య.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్య చిరంజీవి గురించి ఆయన చేసిన ఇంకొక సహాయం గురించి చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా సత్య ప్రకాష్( Satya Prakash ) మాట్లాడుతూ.ఎల్‌ఎంఎల్ స్కూటర్ ఉండేది.షూటింగ్‌కు దాని మీదే వచ్చేవాడ్ని.

Advertisement

అలా ఒకసారి అన్నయ్యతో సినిమా చేస్తున్న సమయంలో ఆ స్కూటీ మీద వచ్చాను.ఆ రోజు అన్నయ్య షూటింగ్ ప్యాకప్ చెప్పి వెళ్లిపోయారేమో అనుకున్నాను.

నా స్కూటర్( Scooter ) తీసుకుని నేను వెళ్లిపోయాను.ఆ మర్నాడు వచ్చాక అన్నయ్య పిలిచాడు.

షూటింగ్‌కు( Shooting ) ఎలా వస్తున్నావ్? అని అడిగారు.స్కూటర్ మీద వస్తున్నాను అని చెప్పాను.

హెల్మెట్ పెట్టుకుంటున్నావా? మరి అని అడిగారు.లేదు అని సమాధానం ఇచ్చాను.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అది చాలా ప్రమాదం.నువ్వు మంచి నటుడివి.

Advertisement

మంచి భవిష్యత్తు ఉంది.హెల్మెట్ పెట్టుకోవడం లేదు.

ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా? ఓ మంచి నటుడ్ని కోల్పోవాల్సి వస్తుంది కదా? నువ్వు పెద్ద స్టార్ అవుతావు. నీకు నేను ఫండింగ్ ఇస్తాను.ఓ కారు( Car ) కొనుక్కో అని అన్నారు.

ఆ షూటింగ్‌లోనే డబ్బులిచ్చారు.బాపినీడు గారు కూడా ఉన్నారు.

అలా నా ఫస్ట్ కారు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని చెప్పుకొచ్చారు నటుడు సత్య.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వీడియోని చూసిన మెగా అభిమానులు అది కదా మెగాస్టార్ అంటే మెగాస్టార్ మనసు చాలా మంచిది గొప్ప మనసు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

తాజా వార్తలు