టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెసెంట్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ మధ్యనే మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి టీజర్ విడుదల అయ్యింది.
మహేష్ ఈ సినిమాలో మరింత యంగ్ గా కనిపిస్తున్నాడు.అంతేకాదు ఈ టీజర్ చూస్తేనే అర్ధం అవుతుంది మహేష్ రోల్ ఎంత ఎనర్జిటిక్ గా ఉందొ.
ఈ సినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.
బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాలో బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, మోసాలు గురించి చూపించ బోతున్నారని తెలుస్తుంది.
ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంకు మేనేజర్ కొడుకుగా నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఇక ఈ సినిమా నుండి మరొక అప్డేట్ వచ్చింది.
ఈ సినిమాలో తమిళ స్టార్ నటుడు సముద్రఖని కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.మరి ప్రెసెంట్ సర్కారు వారి పాట సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.
తాజాగా ఈ సినిమా షూట్ లో సముద్రఖని కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది.నిన్నటి నుండి సర్కారు షూట్ లో పాల్గొంటున్న సముద్రఖని పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.ఈ సినిమా 2021 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా షూట్ పూర్తి అయినా వెంటనే మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy