నవ్యస్వామితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నటుడు రవికృష్ణ.. ప్రపోజ్ చేయాలంటూ?

ప్రముఖ టాలీవుడ్ నటుడు రవికృష్ణ( Ravikrishna ) విరూపాక్ష( Virupaksha ) సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు.

అయితే రవికృష్ణ, నవ్యస్వామి గతంలో ఒక సీరియల్ లో కలిసి నటించగా అప్పటినుంచి వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రవికృష్ణ నవ్యస్వామితో ( Navyaswamy ) రిలేషన్ షిప్ గురించి స్పందించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేసే సమయంలో కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయని ఆయన అన్నారు.

ఆ సమయంలో ఫైనాన్షియల్ బ్యాలెన్స్ ఉండదని రవికృష్ణ చెప్పుకొచ్చారు.ఆ సమయంలో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని అనిపించిందని ఆయన తెలిపారు.

కొంచెం సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యానని రవికృష్ణ చెప్పుకొచ్చారు.వయస్సు అయిపోవడం ఉండదని ప్రభాస్ గారికి వయస్సు అయిపోయిందని చెప్పలేం కదా అంటూ రవికృష్ణ కామెంట్ చేశారు.

Advertisement

నవ్యస్వామితో రిలేషన్ గురించి రవికృష్ణ స్పందిస్తూ మేము కొన్ని షోలకు కలిసి హాజరు కావడంతో ఈ కామెంట్లు వచ్చాయని ఆయన తెలిపారు.ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ అని ఆమెతో సీరియల్ చేసిన తర్వాత నేను మరో సీరియల్ చేయలేదని రవికృష్ణ చెప్పుకొచ్చారు.మా పెయిర్ హిట్ పెయిర్ అని షోలకు ఎక్కువగా పిలుస్తారని రవికృష్ణ కామెంట్ చేశారు.

జనాలు కూడా మా జోడీని మెంటల్ గా ఫిక్స్ అయ్యారని ఆయన తెలిపారు.

చూసేవాళ్లు మేము లవర్స్ అని అనుకుంటున్నారని రవికృష్ణ తెలిపారు.ప్రతిరోజూ టచ్ లో ఉంటామని రవికృష్ణ అన్నారు.నవ్యస్వామి ఒకవేళ ప్రపోజ్ చేస్తే మాత్రం అప్పుడు చూద్దామని ఆయన తెలిపారు.

నవ్యస్వామితో ప్రేమ, పెళ్లి తనకు ఇష్టమేనని పరోక్షంగా రవికృష్ణ పేర్కొన్నారు.మూవీ స్టైల్ కు అనుగుణంగా నేను మారానని ఆయన తెలిపారు.

అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట
Advertisement

తాజా వార్తలు