వెండితెరపై హీరోయిన్గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి మీన ( Meena )ఒకరు.ఈమె బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
అనంతరం హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ తెలుగు తమిళ భాష చిత్రాలలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి మీనా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఇక ఈమె పెళ్లి( Meena Marriage ) తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు.
అయితే తన కుమార్తె కాస్త పెద్దది కావడంతో ఈమె కూడా తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

ఇలా సెకండ్ ఇన్నింగ్స్( Actress Meena Second Innings ) లో భాగంగా కెరియర్ లో బిజీ అవుతున్నటువంటి తరుణంలో మీనా తన భర్తను కోల్పోయారు .ఇలా తన భర్తను కోల్పోయిన బాధలో ఉన్నటువంటి ఈమె ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడి వరుస బుల్లితెర కార్యక్రమాలలోనూ అలాగే వెండితెర సినిమాలలో నటిస్తున్నారు.అదేవిధంగా వరుస యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటున్నారు అయితే తాజాగా మీనా గురించి తమిళనాట వివాదాస్పద సినిమా వ్యాక్తిగా.
సినీ విమర్శకుడిగా పేరున్న బైల్వాన్ రంగనాథన్ ( Bayilvan Ranganath ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఒకప్పుడు సెలబ్రెటీలు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి హాజరవుతూ తమకు మంచి గుర్తింపు లభిస్తుంది అంటూ ఇంటర్వ్యూలకు వెళ్లేవారు అయితే ప్రస్తుతం మాత్రం ఇంటర్వ్యూలకు హాజరు కావాలంటే భారీగానే డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది.ఇటీవల కాలంలో మీనా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో ఆమె రెండు గంటల పాటు పాల్గొన్నారు.
ఈ రెండు గంటలకు 13 లక్షల రెమ్యూనరేషన్ ( Meena Remuneration ) తీసుకున్నారంటూ రంగనాథ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.







