మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి ప్రియాంక జైన్( Priyanka Jain ).ఇలా ఈ సీరియల్లో మూగమ్మాయి పాత్రలో నటించి ఎంతో మందిని ఆకట్టుకున్నటువంటి ప్రియాంక అనంతరం జానకి కలగనలేదు( Janaki Kalaganaledu ) సీరియల్ ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా బుల్లితెర నటిగా ఎంతో మంచే సక్సెస్ అందుకున్నటువంటి ఈమె బిగ్ బాస్( Bigg Boss ) అవకాశాన్ని కూడా అందుకున్నారు.బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి ప్రియాంక టాప్ పై కంటెస్టెంట్ గా నిలిచారు.

ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రియుడు శివకుమార్( Shiva Kumar ) తో తన పెళ్లి జరుగుతుంది అంటూ ఈమె తెలియజేశారు.అయితే బయటకు వచ్చాక ఈమె పెళ్లిమాట ఎత్తలేదు కానీ తన తల్లి అనారోగ్యానికి గురయ్యారనే విషయం తెలుసుకొని ఒక్కసారిగా కృంగిపోయారు.ఈమె తల్లి గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్నారనే విషయం తెలుసుకొని ప్రియాంక ఒక్కసారిగా కృంగిపోయారు తన తల్లికి సర్జరీ చేయించి చికిత్స కూడా అందించారు.అయితే సర్జరీ తర్వాత మరోసారి తనకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలియజేశారు.

ఇలా వైద్య పరీక్షలు నిర్వహించగా తన తల్లికి క్యాన్సర్( Cancer ) పూర్తిగా నయమైందని తెలిపారు.అయితే మరో టెస్ట్ కి సంబంధించిన రిపోర్ట్ రావాల్సి ఉందని అందులో కనుక నెగటివ్ వస్తే తన తల్లి( Priyanka Jain Mother ) పూర్తిగా ఈ క్యాన్సర్ నుంచి బయటపడినట్లేనని ఈమె తన సంతోషం వ్యక్తం చేశారు.ఇలా గత నెల రోజులుగా అనారోగ్యంతో తన తల్లి ఎంతో బాధపడుతూ ఉన్నారు అయితే ప్రస్తుతం తనకు నయమైందనే విషయం తెలియడంతో ప్రియాంక సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహించారు.







