ఆ కేసుతో తనకూ సంబంధం లేదన్న మరో నటుడు

పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ లో నమోదు అయిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం యువతి రేప్ కేసు విషయమై సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.

ఈ కేసులో ప్రదీప్, నటుడు కృష్ణుడు ఇంకా కొందరు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.దాదాపుగా 140 మంది తనపై అఘాయిత్యం చేశారు అటూ ఆమె ఫిర్యాదులో పేర్కొనగా ఎఫ్‌ ఐ ఆర్‌ లో వీరిద్దరి పేర్లను కూడా పోలీసులు చేర్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.ఈ వార్తలపై ఇప్పటికే ప్రదీప్‌ స్పందించాడు.

తనకు ఆ కేసుతో సంబంధం లేదని ఆమె గురించి తనకు తెలియదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.ప్రదీప్‌ తర్వాత నటుడు కృష్ణుడు కూడా మీడియా ముందుకు వచ్చి స్పందించాడు.

తనకు ఎలాంటి సంబంధం లేదని అసలు ఈ కేసులో నిజా నిజాలను బయట పెట్టేందుకు పోలీసులు లోతుగా ఎంక్వౌరీ చేయాలంటూ ఆయన విజ్ఞప్తి చేశాడు.తప్పకుండా తాను ఈ కేసు నుండి బయట పడతాను అంటూ చెప్పుకొచ్చాడు.

సినీ ప్రముఖులను ఈ కేసులో ఇరికించడం వల్ల కేసు తీవ్రత పెరుగుతుందనే ఉద్దేశ్యంతో ఆమె ఈ పని చేసిందేమో అంటూ కృష్ణుడు చెప్పుకొచ్చాడు.ఇదే సమయంలో ఆయన ఆమెపై విమర్శలు చేశాడు.11 ఏళ్లుగా అఘాయిత్యం జరుగుతుందని చెబుతున్నారు.ఆమె చదువుకున్నట్లుగానే కనిపిస్తుంది.

మరి ఎందుకు పోలీసుల ముందుకు వచ్చి ఫిర్యాదు చేయలేదు అంటూ కృష్ణుడు ప్రశ్నించాడు.ఈ విషయమై ఆమె ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.

ఇప్పటికే ఈమె మీడియా ముందుకు వచ్చి పలు సంచలన విషయాలను వెల్లడి చేస్తోంది.ఇప్పుడు వీరిద్దరు ఆమె వాదన ఖండిస్తున్నారు.

మరి ఆమె దీనికి ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.

ప్రశాంత్ నీల్ మూవీలో తారక్ క్యారెక్టర్ ఇదే.. నరరూప రాక్షసుడిగా కనిపిస్తారా?

తాజా వార్తలు